Priyanka Arul Mohan: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బ్యూటీ.. నాగార్జున సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్

సోగ్గాడే చిన్ని నాయినా.. ఈ సినిమా గుర్తుంది కదా.. 2016లో రీలీజై నాగార్జునకు సూపర్ డూపర్ హిట్‌నిచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది.

Priyanka Arul Mohan: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బ్యూటీ.. నాగార్జున సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2021 | 12:20 AM

Priyanka Arul Mohan: సోగ్గాడే చిన్ని నాయినా.. ఈ సినిమా గుర్తుంది కదా.. 2016లో రీలీజై నాగార్జునకు సూపర్ డూపర్ హిట్‌నిచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఎప్పటి నుంచో అదిగో ఇదిగో ఈ సీక్వెల్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఈ మూవీ మేకర్స్… ఆ తరువాత చప్పుడు చేయకుండా ఉన్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నారట ఈ మూవీ యూనిట్. అయితే నాగ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు ” సోగ్గాడే చిన్ని నాయ‌న” డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా… నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాలో చైతన్యకు జోడిగా సామ్ నటించనుందని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం “బంగార్రాజు”లో సామ్ లేదట… చైతూకు జోడిగా తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందట. ఆ పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ను సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ‘బంగార్రాజు’ సినిమా కోసం ఆమెను సంప్రదించడమనేది ఎంతవరకూ వాస్తవమో చూడాలి. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Karthi: ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతుందంట.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. స్క్రిప్ట్ పనులు కూడా అవుతున్నాయట…

Zombie Reddy: టెలివిజన్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జాంబీరెడ్డి… రెండోసారి కూడా అదిరిపోయే టీఆర్ఫీ తెచ్చుకున్న సినిమా..

Megastar Chiranjeevi: మరో రీమేక్ కు సిద్దమవుతున్న మెగాస్టార్.. ఈసారి ప్రభాస్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్న చిరంజీవి..