Ram Charan- Balakrishna: బాలయ్య ముందే ప్రభాస్‌కు కాల్ చేసిన చరణ్.. డార్లింగ్ ఏం చెప్పారంటే..
గేమ్ ఛేంజర్ సినిమాతో ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 10న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇందులో బాలీవుడ్ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ సైతం వేగంగా జరుగుతున్నాయి. జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలోనూ ఈ చిత్రం అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇటీవలే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇక త్వరలోనే ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన డేట్ కు మెగా ఈవెంట్ జరగనున్నట్లు నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు రామ్ చరణ్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో నాలుగో సీజన్ ఎనిమిదవ ఎపిసోడ్ కు అతిథిగా వచ్చారు చరణ్. ఆయనతోపాటు శర్వానంద్, యువ నిర్మాత విక్రమ్ రెడ్డి సైతం వచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో చరణ్ తన మిత్రుడు రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫోన్ చేశారట.
గతంలో ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకు రాగా.. అప్పుడు డార్లింగ్ చరణ్ కు కాల్ చేశాడు. దీంతో ప్రభాస్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబుతూ సరదాగా ఆటపట్టించాడు. నువ్వు కూడా అన్ స్టాపబుల్ షోకు వస్తావుగా.. అప్పుడు నాకే చేయాలి.. అప్పుడు చెబుతా అంటూ ప్రభాస్ ఫన్నీగా అన్నాడు. ఇక ఇప్పుడు చరణ్ సైతం ప్రభాస్ కే కాల్ చేశాడని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి ఫోన్ కాల్ సంభాషణ ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ అంటున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.
The Global star Ramcharan is here!
Get ready for the biggest and most explosive episode ever! 🌟🔥@AlwaysRamCharan @ImSharwanand#UnstoppableWithNBKS4 #aha #Ramcharan #Balakrishna #Gamechanger pic.twitter.com/Bgd5ivdoJr
— ahavideoin (@ahavideoIN) December 31, 2024
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.