బాలయ్య సినిమాకు భారీ ధర.. అఖండ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమోంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నటసింహం నందమూరి బాలకృష్ణ ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరపైకెక్కుతున్న అఖండ . సింహ , లెజండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో
balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరపైకెక్కుతున్న అఖండ . సింహ , లెజండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందిస్తున్నాడు బోయపాటి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు. ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ రైట్స్ ను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’, ‘స్టార్ మా’ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు హక్కుల నిమిత్తం 13 నుంచి 15 కోట్ల వరకూ డీల్ కుదిరినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ కెరియర్లో అత్యధిక రేటు పలికిన సినిమా ఇదేనని అంటున్నారు. ఇక తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని చిత్రయూనిట్ అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
21 Years for Badri: పవన్ కళ్యాణ్ బద్రికి 21 సంవత్సరాలు.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న డైలాగ్స్..
కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….