AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ముద్దు సీన్స్‌ తీసేప్పుడు ప్రభాస్‌ ఎలా ఫీలవుతారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన డార్లింగ్‌..

Radhe Shyam: ప్రస్తుతం ఇండియా మొత్తం రాధేశ్యామ్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సాహో (Saaho) విడుదలై దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూడడానికి ఆయన ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా...

Radhe Shyam: ముద్దు సీన్స్‌ తీసేప్పుడు ప్రభాస్‌ ఎలా ఫీలవుతారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన డార్లింగ్‌..
Prabhas
Narender Vaitla
|

Updated on: Mar 06, 2022 | 6:40 AM

Share

Radhe Shyam: ప్రస్తుతం ఇండియా మొత్తం రాధేశ్యామ్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సాహో (Saaho) విడుదలై దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ప్రభాస్‌ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూడడానికి ఆయన ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు మెరుగుకావడంతో రాధేశ్యామ్‌ మార్చి 11న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇక సినిమాపై అంచానాలు కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్‌ ట్రైలర్‌, మేకింగ్ వీడియో విడుదల తర్వాత అందరిలోనూ రాధేశ్యామ్‌పై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ప్రభాస్‌, పూజా హెగ్డేలు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

సాధారణంగానే ప్రభాస్‌కు కాస్త సిగ్గు ఎక్కువనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేజ్‌పై కూడా ప్రభాస్‌ మాట్లాడేది చాలా తక్కువ. ప్రభాస్‌తో సన్నిహితంగా ఉన్న వారు ఇదే విషయాన్ని చెబుతుంటారు. అయితే సినిమాల్లో ముద్దు సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో ఎలా ఫీలవుతారని ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ప్రభాస్‌. పూజాహెగ్డేతో ముద్దు సీన్లు చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించిందన్నారు. రాధేశ్యామ్‌ ప్రేమ కథా చిత్రం కాబట్టి దర్శకుడు అలాంటి సన్నివేశాలు రాయాల్సి వచ్చిందని ప్రభాస్‌ తెలిపారు.

ఇక స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు చేయలేనని చెప్పలేనన్నారు. ‘కమర్షియల్‌ సినిమాల్లో అయితే రొమాంటిక్‌ సన్నివేశాలను చెప్పి తొలగించేయవచ్చు. కానీ ప్రేమ కథా చిత్రాల్లో అది కుదరదు. కేవలం ముద్దు సన్నివేశాలే కాదు.. అందరి ముందు షర్ట్‌ లేకుండా నటించాలంటే ఇప్పటికీ ఇబ్బందిగానే ఉంటుంది. షర్ట్‌ లేకుండా నటించే సన్నివేశాల సమయంలో సెట్‌లో ఎంత మంది ఉంటారో చూసుకుంటా. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఈ సన్నివేశాన్ని మరో చోట షూట్‌ చేయమని అడుగుతా’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్‌కు ఎంత సిగ్గో దీనిబట్టే అర్థమవుతోంది కదూ.!

Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన జైశంకర్, దోవల్

Andhra Pradesh: డ్రా చేయకుండానే ఖాతాల నుంచి సొమ్ము ఖతం.. ఆ జిల్లాలో వింత పరిస్థితి

కేంద్ర మంత్రికి లోకేశ్ లేఖ.. ఆదుకోకుండా భారం మోపడం ఏమిటని ప్రశ్న