AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన జైశంకర్, దోవల్

ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు క్షేమంగా తిరిగి రావడంపై ప్రధాని మోడీ సమీక్షించారు.

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన జైశంకర్, దోవల్
Pm Modi
Balaraju Goud
|

Updated on: Mar 05, 2022 | 9:14 PM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు(Indians) క్షేమంగా తిరిగి రావడంపై ప్రధాని మోడీ సమీక్షించారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇందుకు ముందు కూడా ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis)పై ప్రధాని మోడీ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశానికి ముందు, ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరం నుండి దాదాపు భారతీయులందరినీ తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకా పేర్లు నమోదు కాని వారి కోసం వెతుకులాట ప్రారంభించామన్నారు.

ఉక్రెయిన్‌లో ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారో ఇప్పుడు చూస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. భారత రాయబార కార్యాలయం అక్కడ ఉండే అవకాశం ఉన్నవారిని సంప్రదిస్తుందని, అయితే ఇంకా నమోదు చేసుకోలేదని చెప్పారు. అదే సమయంలో సుమీపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముండటంతో.. ప్రధాని మోడీ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.

అక్కడి పరిస్థితి సవాల్‌గా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.సుమీలో హింస కొనసాగుతోందని బాగ్చి తెలిపారు. దీంతో పాటు ఇక్కడికి రవాణా సౌకర్యం కరువైంది. గత 24 గంటల్లో 15 విమానాలు భారత్‌కు చేరుకున్నాయని, అందులో దాదాపు 2900 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన చెప్పారు. ‘ఆపరేషన్ గంగా’ కింద ఇప్పటివరకు 63 విమానాలు సుమారు 13,300 మంది భారతీయులతో భారతదేశానికి చేరుకున్నాయి. మరో 24 గంటల్లో మరో 13 విమానాలు భారీతీయులు తీసుకుని బయలుదేరినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి నుంచి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మేము ఫిబ్రవరి 15 న ఒక సలహా ఇచ్చాము . మేము రష్యన్ మాట్లాడే బృందాలను చుట్టుపక్కల నాలుగు దేశాలకు పంపామన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసామని, మార్చి 4 నాటికి మేము ఉక్రెయిన్ నుండి 16,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామన్నారు. అలాగే 13,000 మందికి పైగా పౌరులు భారతదేశానికి చేరుకున్నారని, మరిన్ని విమానాలు వస్తున్నాయని చెప్పారు.

Read Also…. 

Russia Ukraine War: ఖార్కివ్‌లో ‘ఆపరేషన్ గంగా’ విజయవంతం.. భారతీయులందరు సురక్షితంః కేంద్రం

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్ వినతి.. మా విద్యార్థుల కోసం సేఫ్ కారిడార్..

Telugu Students: తిండి లేదు.. చుట్టూ బాంబుల మోత.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసిన పాలమూరు బిడ్డ