AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌, మారుతి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. త్వరలోనే కొత్త టైటిల్‌ ప్రకటన..

Prabhas: ప్రభాస్‌ గురించి ఇప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా అది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంది. నేషనల్‌ మీడియా సైతం ప్రభాస్‌ ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా...

Prabhas: ప్రభాస్‌, మారుతి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. త్వరలోనే కొత్త టైటిల్‌ ప్రకటన..
Prabhas Maruthi Movie
Narender Vaitla
|

Updated on: Mar 06, 2022 | 6:20 AM

Share

Prabhas: ప్రభాస్‌ గురించి ఇప్పుడు ఏ చిన్న వార్త వచ్చినా అది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతుంది. నేషనల్‌ మీడియా సైతం ప్రభాస్‌ ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలితో (Bahubali) ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా డార్లింగ్‌కు బాలీవుడ్‌లో (Bollywood) విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఎంతలా అంటే ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి హిందీ దర్శకులు పోటీపడేంతా. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రం తెలుగులో మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్‌ ఇటీవల తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రభాస్‌ కొత్త చిత్రం రాధేశ్యామ్‌పైనే చర్చ జరుగుతోంది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ఇంక విడుదలవ్వక ముందే ప్రభాస్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చేతిలో ఏకంగా ఐదు సినిమాలున్నాయి. వీటిలో మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమా ఒకటి. మొదట్లో పాన్‌ ఇండియా స్థాయి హీరో.. మారుతి డైరెక్షన్‌లో సినిమా ఏంటని చాలా మంది అనుమానించారు. కానీ తర్వాత వచ్చిన వార్తలు ఇది నిజమేనని తేల్చి చెప్పాయి. అయితే మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా సందీప్‌ వంగ ‘స్పిరిట్‌’ తర్వాత ఉంటుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా స్పిరిట్‌ కంటే ముందు మారుతి ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమా హార్రర్‌ థ్రిల్లర్‌ అంటూ, సినిమా టైటిల్‌ రాజా డీలక్స్‌ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజా డీలక్స్‌ కేవలం వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమేనని, త్వరలోనే కొత్త టైటిల్‌ను ప్రకటించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!

Andhra Pradesh: డ్రా చేయకుండానే ఖాతాల నుంచి సొమ్ము ఖతం.. ఆ జిల్లాలో వింత పరిస్థితి