Chiranjeevi: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. కారణమేంటంటే..
మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మర్యాదపూర్వకరంగా కలిశారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు
మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మర్యాదపూర్వకరంగా కలిశారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌లో నిర్వహించే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాల్సిందిగా మెగాస్టార్‌ను ఆహ్వానించారు. కాగా ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు దక్కిన గౌరవమని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు చిరంజీవి (Chiranjeevi). రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానాన్ని అందించినందుకు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ‘జానపద, గిరిజన కళలు, సంగీతం, వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటి ఉన్నతమైన వేదికలు అవసరం. మన దేశంలోని కళాకారులు, చేతివృత్తుల వారి జీవనోపాధికి తోడ్పడేందుకు గొప్ప వేదికను అందిస్తుంది’ అని చిరంజీవి ట్వి్ట్టర్ లో రాసుకొచ్చారు.
కాగా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే… చిరంజీవి నటించిన ఆచార్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక దీంతో పాటు లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ , వేదాళం రీమేక్ ‘ భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే కే.ఎస్, రవీంద్ర, వెంకీ కుడుముల సినిమాలకు కూడా సైన్ చేశారు.
Thank you @kishanreddybjp garu#RashtriyaSanskritiMahotsav pic.twitter.com/Qu7ZsP1d1X
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 5, 2022