Chiranjeevi: ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు.. ప్రయోగాలు అంటూ తంటాలు పడుతుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం మాస్ ఫార్ములాతోనే మెప్పిస్తున్నారు.

Chiranjeevi: ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2022 | 9:25 PM

Chiranjeevi: యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు.. ప్రయోగాలు అంటూ తంటాలు పడుతుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం మాస్ ఫార్ములాతోనే మెప్పిస్తున్నారు. తిరుగులోని మాస్ ఇమేజ్‌ ఉన్న మెగాస్టార్‌ లైన్‌లో ఉన్న అన్ని సినిమాల్లోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే.. వింటేజ్ చిరు గుర్తుకొస్తున్నారంటున్నారు ఫ్యాన్స్‌. ఇటీవలే శివరాత్రి సందర్భంగా మెగాస్టార్ మూవీ నుంచి మేజర్ అప్‌డేట్ వచ్చింది. అప్‌కమింగ్ మూవీ భోళాశంకర్‌లో చిరు లుక్‌ను రివీల్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. తమిళ బ్లాక్ బస్టర్‌ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న మూవీ ఇదే. ఈ సినిమాలో ఊరమాస్ గెటప్‌లో కనిపించబోతున్నారు మెగాస్టార్‌. సినిమా సిస్టర్ సెంటిమెంటే అయినా.. చిరును ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటారో అంతకు మించి ప్రజెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అసలు రీ ఎంట్రీ నుంచే మాస్ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారు మెగాస్టార్‌. ఖైదీ నంబర్‌ 150తో కమర్షియల్ స్టార్‌గా తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు చిరు. తమిళ్‌ సూపర్‌ హిట్ కత్తి సినిమాకు మెగా టచ్‌ ఇస్తూ రీమేక్‌ చేసిన తీరుకూ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. మెగాస్టార్‌ను మరోసారి స్క్రీన్ మీద చూడటమే పెద్ద పండుగ అంటే.. అదిరిపోయే పంచ్‌ డైలాగ్‌లు.. అంతకు మించిన మాస్ ఎలివేషన్‌తో సూపర్బ్ అనిపించారు. ఖైదీ నంబర్‌ 150 విషయంలో మాస్ ఫార్ములా సూపర్‌గా వర్క్ అవుట్ కావటంతో వరుసగా అలాంటి సినిమాలనే లైన్‌లో పెట్టారు. భోళాశంకర్‌తో పాటు ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న గాడ్‌ ఫాదర్‌, బాబీ డైరక్ట్ చేస్తున్న సినిమా కూడా ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లే. దాంతో మెగాస్టార్ ఫ్యాన్స్ కు రాబోయే సినిమాలన్నీ మసాలా దట్టించిన మంచి బిర్యానిలా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: బాబు బంగారం.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం మహేష్ మరో అడుగు..

Samantha: సామ్‌ క్రేజ్‌ మాములుగా లేదుగా.. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్‌!..

F3 Movie : ఎఫ్ 3 సెట్‌లో నానా రచ్చ చేసిన నాగ రత్తమ్మ.. వెంకీ- వరుణ్ ఏం చేశారంటే..!

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు