AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సారీ చెప్పను.. ఏం చేసుకుంటావో చేసుకో.. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్లో సిరికి కౌంటర్‌ ఇచ్చిన సన్నీ..

Bigg Boss 5 Telugu: ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కి బిగ్‌బాస్‌ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒక్కో కంటెస్టెంట్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళుతుండడం. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్క్‌లు, ఎలిమినేషన్‌ టాస్క్‌లతో హౌజ్‌..

Bigg Boss 5 Telugu: సారీ చెప్పను.. ఏం చేసుకుంటావో చేసుకో.. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్లో సిరికి కౌంటర్‌ ఇచ్చిన సన్నీ..
Narender Vaitla
|

Updated on: Oct 13, 2021 | 6:12 PM

Share

Bigg Boss 5 Telugu: ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కి బిగ్‌బాస్‌ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒక్కో కంటెస్టెంట్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళుతుండడం. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్క్‌లు, ఎలిమినేషన్‌ టాస్క్‌లతో హౌజ్‌ హోరెత్తుతోంది. ఇక హౌజ్‌మేట్స్‌ మధ్య అలకలు, కోపాలు, బుజ్జగింపులు, అప్పుడడప్పుడు చిన్న చిన్న రొమాన్స్‌లు ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఒకేచోట కనిపిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు సైతం బిగ్‌ బాస్‌ షోకి ఫిదా అవుతున్నారు. తమ అభిమాన స్టార్‌లను ఎలిమినేషన్‌ నుంచి తప్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన బీబీ బొమ్మల ఫ్యాక్టరీ అనే కెప్టెన్సీ టాస్క్‌ నిన్నంతా రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. హౌజ్‌ మేట్స్‌ను రెండు గ్రూప్‌లుగా విభజించిన బిగ్‌బాస్‌.. సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్‌ సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పాడు. టాస్క్‌లో భాగంగా ఏ టీమ్‌ ఎక్కువగా బొమ్మలు తయారు చేస్తే వారు విజయం సాధించినట్లు. ఈ క్రమంలోనే గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్ పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకుని బొమ్మలను రెడీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ టాస్క్‌ రసాబాసగా మారింది. రా మెటిరీయల్స్‌ను ఒకరి నుంచి మరొకరు లాక్కోవడానికి చేసిన ప్రయత్నాలు పెద్ద గొడవకు దారి తీశాయి.

అయితే తాజాగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈరోజు (బుధవారం) కూడా హౌజ్‌లో రచ్చ కొనసాగినట్లు అర్థమవుతోంది. బిగ్‌బాస్‌ కాటన్‌ను పంపించిన వెంటనే ఒక్కసారిగా హౌజ్‌మేట్స్‌ పరిగెత్తుకొచ్చారు. దీంతో సన్నీకి కాటన్‌ దొరకపోయే సరికి ‘ఇది ఎందిరా భయ్‌.. తొక్కలో ఆట’ అని ఒక్కసారిగా అరిచేశాడు. దీంతో స్పందించిన సిరి.. సంచాలక్‌ మీద ఎందుకు అరుస్తారు అని మరో కంటెస్టెంట్‌తో చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగని సిరి.. అందరి ముందు తనకు క్షమాపణలు చెప్పాలని సన్నీకి అల్టిమేటం జారీ చేసింది. అయితే అదే స్థాయిలో స్పందించిన సన్నీ.. ‘అందరి ముందు సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేసుకోపో.. అంటూ పవన్‌ కళ్యాణ్‌ మేనేరిజంతో ఓ పంచ్‌ విసిరాడు.

ఇక సంచాలకులిగా వ్యవహరిస్తున్న కాజల్‌.. ‘మేము పెట్టిన రూల్‌ను అతిక్రమించి కాటన్‌ లాక్కున్నందుకు.. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరు ఫ్రంట్‌ నిల్చుంటారని చెప్పుకొచ్చింది. దీంతో దీనికి ఘాటుగా స్పందిచిన ప్రియా.. మేము ఈ నిబంధనను ఒప్పుకోం అని చెప్పింది. కాజల్‌కు సపోర్ట్‌గా సిరి కూడా సంచాలక్‌గా ఇదే ఫైనల్‌ నిర్ణయం చెబుతుంది. దీనిపై ప్రియా కాస్త ఘాటుగా స్పందిస్తూ.. నిన్న అందరూ ఇదే పని చేస్తే సంచాలక్‌లు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో సన్నీ విజిల్‌ వేయడం, కాజల్‌ కోపంగా చూడడం.. హౌజ్‌లో గందరగోళానికి దారి తీసింది. ఇక అప్పటి వరకు కోపంగా ఉన్న సన్నీ ఫోక్‌ సాంగ్‌ పాడుతూ ఎంజాయ్‌ చేశాడు. ఇక సిరిని గట్టిగా హగ్‌ చేసుకున్న షణ్ముఖ్‌.. నిన్ను ఓదార్చాలా.? దొబ్బెయ్‌ అని బాధపడాలా అర్థం కావడం లేదంటూ షణ్ముఖ్‌ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉండేలా కనిపిస్తున్నాయి.

Also Read: ICC T20 World Cup: షాకిచ్చిన బీసీసీఐ.. ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన అక్షర్.. స్టాండ్‌ బై‌లో ప్లేయర్‌కు ఛాన్స్

Virat Kohli: టైటిల్ కోసం పూర్తి ప్రయత్నం చేశాను.. ఆర్సీబీకి కృతజ్ఞతలు.. విరాట్ కోహ్లీ భావోద్వేగ వీడియో..

Throwback Pic: ఈ ఫొటోలో నవ్వుతూ కెమెరా వైపు చూస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడీమె కుర్రాళ్ల కలల రాకుమారి..