AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli sandaD: ఒంగోలులో సందడి చేసిన పెళ్ళిసందడి చిత్ర యూనిట్ రోషన్, శ్రీ లీల.. చిత్ర యూనిట్

Pelli sandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఒంగోలు అమ్మాయి శ్రీలీల హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన తాజా సినిమా చిత్రం పెళ్లి సందడి...

Pelli sandaD: ఒంగోలులో సందడి చేసిన పెళ్ళిసందడి చిత్ర యూనిట్ రోషన్, శ్రీ లీల.. చిత్ర యూనిట్
Pelli Sandad At Ongole
Surya Kala
|

Updated on: Oct 13, 2021 | 9:56 PM

Share

Pelli sandaD: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఒంగోలు అమ్మాయి శ్రీలీల హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన తాజా సినిమా చిత్రం పెళ్లి సందడి… సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒంగోలులో చిత్ర యూనిట్‌ సందడి చేసింది… ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 25 ఏళ్ల క్రింద ఇదే పెళ్లి సందడి పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు.. ఇప్పుడు మోడ్రన్ పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

1996లో విడుద‌లైన ఈ సినిమా దాదాపు ఏడాది పాటు ప్రద‌ర్శించ‌బ‌డింది. అంతేకాక బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచి పాతికేళ్లుగా శ్రోతలను అలరిస్తోంది. నాటి పెళ్లిసంద‌డి లో రాఘవేంద్రుడి టేకింగ్, కీరవాణి మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. అయితే ఇప్పుడు మరోసారి సందడి చేసేందుకు ఇదే కాంబో రిపీట్ కాబోతుంది. అయితే ఈసారి దర్శకేంద్రుడి దర్శకత్వంలో కాకుండా.. గౌరీ రోనంకి దర్శకత్వంలో పెళ్లి సందడి అనే టైటిల్‌తో ఈనెల 15న ఢియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాత సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ఇందులో రోషన్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా మనకు కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఆయన హీరోయిన్‌తో ప్రేమలో పడటం చూపించారు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణమోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందిన ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read:  ఎండు ద్రాక్షని నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తింటే కలిగే లాభాలు ఎన్నో..