AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Throwback Pic: ఈ ఫొటోలో నవ్వుతూ కెమెరా వైపు చూస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడీమె కుర్రాళ్ల కలల రాకుమారి..

Throwback Pic: చిన్నతనంలో దిగిన ఫొటోలు ఎప్పుడూ బాగుంటాయి. ఒక్కసారిగా పాత ఆల్బమ్స్‌ని ముందేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు మనసులను తట్టిలేపుతుంటాయి. 20 ఏళ్ల క్రితం ఇప్పుడున్నట్లు సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్‌లు లేవు....

Throwback Pic: ఈ ఫొటోలో నవ్వుతూ కెమెరా వైపు చూస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడీమె కుర్రాళ్ల కలల రాకుమారి..
Narender Vaitla
|

Updated on: Oct 13, 2021 | 4:34 PM

Share

Throwback Pic: చిన్నతనంలో దిగిన ఫొటోలు ఎప్పుడూ బాగుంటాయి. ఒక్కసారిగా పాత ఆల్బమ్స్‌ని ముందేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు మనసులను తట్టిలేపుతుంటాయి. 20 ఏళ్ల క్రితం ఇప్పుడున్నట్లు సోషల్‌ మీడియా, స్మార్ట్‌ ఫోన్‌లు లేవు. అప్పట్లో కచ్చితంగా కెమెరాలోనే ఫోటో దిగాలి. ఆ ఫోటోను కడిగించుకొని ఆల్బమ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ సంబరపడాలి.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

అయితే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పాత ఫోటోలను స్మార్ట్‌ఫోన్‌లతో తీసుకొని సోషల్‌ మీడియా సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం మనలాంటి సామాన్యులకే పరిమితం కాదు.. సెలబ్రిటీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ తారలు, ముఖ్యంగా హీరోయిన్‌లు తమ చిన్ననాటి ఫోటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ అందాల తార తన చిన్ననాటి ఫోటోను షేర్‌ చేసింది. చెల్లి పుట్టిన రోజు వేడుకల్లో దిగిన ఫోటోను షేర్‌ చేసింది. ఓసారి పైన ఫోటోలో నవ్వుతూ కెమెరావైపు చూస్తోన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. కాస్త కష్టంగా ఉంది కదూ.! కానీ ఆ చిన్నారే ఇప్పటి ‘బుట్ట బొమ్మ’ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అవును.. మీరనుకుంటుంది నిజమే. ఆ ఫోటోలో ఉంది మరెవరో కాదు అందాల బుట్టబొమ్మ పూజా హేగ్డేనే. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఈ అందాల తార పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్‌ వస్తున్నాయి. ఇదిలా ఉంటే పూజా తాజాగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇక పూజా ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్‌’, ‘బీస్ట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Also Read: Viral Photos: పురాతన వింత బండరాయి.. రెండుగా చీలింది.. ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు.!

Asamai Temple: తాలిబన్ల రాజ్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు.. ఆశామాయి ఆలయంలో హిందువులు, సిక్కుల భజనలు..

Maruti Suzuki: కారు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. పండగ సీజన్‌లో మారుతి సుజుకీ బంపర్‌ ఆఫర్‌.. !

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..