Viral Photos: పురాతన వింత బండరాయి.. రెండుగా చీలింది.. ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు.!

Al Naslaa Rock: సముద్రం మధ్య మంచినీటి బావి, దానంతట అదే రంగు మార్చుకోగలిగిన సరస్సు, పురాతన బండరాళ్లు.. ఇలా ఎన్నో..

|

Updated on: Oct 13, 2021 | 5:55 PM

మన ప్రపంచంలో వింతలకు కొదవలేదు. ఆ వింతల్లో కొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పరిష్కరించలేని పజిల్స్‌గానే మిగిలిపోయాయి. సముద్రం మధ్య మంచినీటి బావి, దానంతట అదే రంగు మార్చుకోగలిగిన సరస్సు, పురాతన బండరాళ్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మీరెప్పుడైనా సమానంగా విడిపోయిన బండరాయి చూశారా.? అయితే ఈ స్టోరీ చదవండి.

1 / 7
పునాది బలం లేకపోయినా రెండు భాగాలుగా విడిపోయి పడిపోకుండా నిలబడినట్లు ఉన్న ఈ పురాతన బండరాయి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న మిస్టరీ. దీనిని అల్ నస్లా (Al Naslaa) అంటారు.

2 / 7
సౌదీ అరేబియాలోని తమ్యా ఒయాసిస్ ప్రాంతంలో ఈ బండరాయి ఉంది. ఇది 30 అడుగుల పొడువు. 25 అడుగుల వెడల్పు ఉంటుంది. అలాగే ఈ బండరాయి 4 వేల ఏళ్ల పురాతనమైనది.

3 / 7
ఇది ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే.. ఓ సాహసయాత్రకు వెళ్లినట్లే. ఈ బండరాయి ఉంటున్న ప్రాంతం దగ్గర నుంచి చుట్టూ 20 కిలోమీటర్ల వరకు అంతా ఎడారి. వాహనాల్లో వెళ్లినా కూడా మీరు కాస్త దూరం నడవాల్సి ఉంటుంది.

4 / 7
 ఇక ఈ బండరాయి ఉంటున్న ప్రదేశాన్ని మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో అల్ నస్లా ఫార్మేషన్(Al Naslaa Rock Formation) అని టైప్ చేస్తే అది ఉన్న లొకేషన్‌ను మీరు చూడవచ్చు.

5 / 7
ఉల్లిపాయ ముక్కను రెండు ముక్కలుగా కోసినట్లు.. ఎవరో ఈ రాయిని సరిగ్గా సమానంగా లేజర్ కిరణాలతో కట్ చేసినట్లు ఉంటుంది. ఈ బండరాయి ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.

6 / 7
 దీనిని ఎవరైనా కట్ చేశారా.? లేదా ప్రకృతి సిద్దంగా కట్ అయ్యిందా అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పెద్ద మిస్టరీ. కొంతమంది అయితే దీనిని ఏలియన్స్ కట్ చేశారని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ బండరాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులను దశాబ్దాలుగా ఆకర్షిస్తోంది.

7 / 7
Follow us