సన్నబడిన అనుష్కను చూశారా..!

‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారై.. ఆ తరువాత తగ్గేందుకు అష్టకష్టాలు పడ్డ అనుష్క సన్నగా మారిపోయింది. ఎంత సన్నగా అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌కు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా.. ఏంటి నమ్మాలనిపించట్లేదా.. నిజం అండీ.. తాజాగా అనుష్కకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో అనుష్క మునుపటిలా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె మొహంలోనూ ఎలాంటి మార్పులు లేవు. అచ్చు పాత స్వీటీలా మారిపోయిన ఆమె ఫొటోలను చూసిన అభిమానులు […]

సన్నబడిన అనుష్కను చూశారా..!
‘సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారై.. ఆ తరువాత తగ్గేందుకు అష్టకష్టాలు పడ్డ అనుష్క సన్నగా మారిపోయింది. ఎంత సన్నగా అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌కు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా.. ఏంటి నమ్మాలనిపించట్లేదా.. నిజం అండీ.. తాజాగా అనుష్కకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో అనుష్క మునుపటిలా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె మొహంలోనూ ఎలాంటి మార్పులు లేవు. అచ్చు పాత స్వీటీలా మారిపోయిన ఆమె ఫొటోలను చూసిన అభిమానులు క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా అనుష్క త్వరలో మరో లేడి ఓరియెండెట్ చిత్రంలో నటించనుంది. ఆర్ మాధవన్ ఇందులో ప్రధానపాత్రలో నటించనున్నాడు. కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుంది.

Published On - 5:02 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu