తన వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటో చెప్పేసింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఇంతవరకు తాను నటించిన చిత్రాలేవీ మొదటి రోజు కుటుంబంతో చూడలేదని ఈ సారి మాత్రం చూస్తానని.. అదే తన ప్రేమికుల రోజు ప్రణాళిక అంటూ రకుల్ చెప్పింది. కార్తీ సరసన రకుల్ ‘దేవ్’లో నటించగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మొదటి రోజే చూస్తానంటూ రకుల్ తెలిపింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాహాసాలు చేసే ఓ అబ్బాయి, ఇండిపెండెంట్‌గా ఉండే ఓ అమ్మాయి మధ్య జరిగే మంచి లవ్ స్టోరీ ‘దేవ్’ అని చెప్పింది. ఈ చిత్రంలో కార్తితో రెండోసారి జత కట్టానని.. ఈ మూవీ తమకు మరో హిట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక తాను రియల్ లైఫ్‌లోనూ చాలా సాహాసాలు చేశానని.. స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, భంగీ జంప్‌లు చేశానంటూ రకుల్ చెప్పుకొచ్చింది. కాగా తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తుండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చిందని.. అంతేకానీ టాలీవుడ్‌కు తాను దూరం కాలేదంటూ మరోసారి స్పష్టం చేసింది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి