27 సంవత్సరాల తరువాత రజనీ చిత్రానికి

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:57 PM

27సంవత్సరాల తరువాత రజనీ చిత్రానికి మరోసారి పనిచేసే అవకాశం సొంతం చేసుకున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్. రజనీతో మురగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం కోసం సినిమాటోగ్రాఫర్‌గా సంతోశ్ శివన్ ఫైనల్ అవ్వగా.. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ‘‘దళపతి చిత్రం తరువాత రజనీ సర్‌ చిత్రానికి పనిచేస్తున్నా. చాలా ఆనందంగా […]

27 సంవత్సరాల తరువాత రజనీ చిత్రానికి
27సంవత్సరాల తరువాత రజనీ చిత్రానికి మరోసారి పనిచేసే అవకాశం సొంతం చేసుకున్నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్. రజనీతో మురగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం కోసం సినిమాటోగ్రాఫర్‌గా సంతోశ్ శివన్ ఫైనల్ అవ్వగా.. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ‘‘దళపతి చిత్రం తరువాత రజనీ సర్‌ చిత్రానికి పనిచేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది’’ అంటూ సంతోశ్ శివన్ ట్వీట్ చేశారు.
ఇక ఈ చిత్రంలో రజనీ సరసన కీర్తి సురేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మాస్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ గానీ హారీశ్ జైరాజ్ గానీ సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా రజనీ, మురగదాస్ కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu