Bheemla Nayak: పవర్‌స్టార్ సినిమాలో మరో సర్‌ప్రైజ్.. రంగంలోకి దిగిన క్రేజీ సింగర్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా నటిస్తోన్న చిత్రం 'భీమ్లానాయక్' (BheemlaNayak). నిత్య మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోలుగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లానాయక్’ (BheemlaNayak). నిత్య మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేం సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ స్వయంగా ప్రకటించారు.
కాగా భీమ్లానాయక్ సినిమాలోని కీలకమైన పాటకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ కైలాష్ ఖేర్ ను తీసుకొచ్చారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించనున్నారు. ‘మా సెన్సేషనల్ భీమ్లా నాయక్ కి మరో క్రేజీ అడిషన్’ అంటూ కైలాష్ ఖేర్, త్రివిక్రమ్, రామజోగయ్యశాస్త్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు థమన్. కాగా ‘జయహో జనతా’ (జనతా గ్యారేజ్), ‘ఏడ పోయినాడో’ (అరవింద సమేత), ‘వచ్చాడయ్యో సామి’ (భరత్ అనే నేను), ‘పండగలా దిగి వచ్చాడు’ (మిర్చి) తదితర పాటలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కైలాష్ ఖేర్. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భీమ్లానాయక్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Our New Crazy Addition To #SenationalBheemlaNayak Soon will be ur #Addiction tooo @Kailashkher with My Genius dear director Shri #Trivikram gaaru and the Pen ? tat always carries Some Soul and Some Soil in it @ramjowrites gaaru Was a Magical day for Us ♥️??? pic.twitter.com/04hmc3lwT3
— thaman S (@MusicThaman) February 14, 2022
Vijayawada: కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై పోలీసుల కొరడా.. RTC బస్సులో మాస్క్ ధరించలేదని..
Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..