Vijayawada: కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై పోలీసుల కొరడా.. RTC బస్సులో మాస్క్ ధరించలేదని..
దేశంలో కరోనా కేసులు (Corona Cases) తగ్గుతున్నా వైరస్ ఇంకా మన మధ్యనే ఉందనేది జీర్ణించుకోలేని వాస్తవం.
దేశంలో కరోనా కేసులు (Corona Cases) తగ్గుతున్నా వైరస్ ఇంకా మన మధ్యనే ఉందనేది జీర్ణించుకోలేని వాస్తవం. అందుకే మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు మాస్క్ ధరించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా పీడ పూర్తిగా అంతమయ్యేవరకు ఈ జాగ్రత్తలు తప్పవని సూచిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కరోనా తగ్గిపోయిందని తమకేం కాదంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈక్రమంలో కొవిడ్ నిబంధనలను (Covid Rules) పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి జరిమానా విధించారు ఏపీ పోలీసులు.
సోమవారం విజయవాడ పరిధిలో కొవిడ్ నిబంధనలు అమలవుతున్న తీరుపై పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించనివారి నుంచి జరిమానా వసూలు చేశారు. ఈ క్రమంలో విజయవాడ- నూజివీడు రహదారి లో పైపుల రోడ్డు కూడలి మార్గంలో వెళుతోన్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించారు. బస్సులో మాస్కులు ధరించకుండా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నవారికి రూ. 100 జరిమానా విధించారు. కొవిడ్ పూర్తిగా అంతమయ్యేవరకు మాస్క్‌లు ధరించాలని ఈ సందర్భంగా అధికారులు ప్రయాణికులకు సూచించారు.
కాగా ఏపీలో నిన్న (ఫిబ్రవరి 13) మొత్తం 785 కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ముగ్గురు వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 929 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Also Read:Valentine’s Day 2022: ఈ ఏడాది వెండితెరపై ప్రేమను పంచేందుకు వస్తోన్న సినిమాలివే..
PM Narendra Modi: పుల్వామా ఘాతుకానికి మూడేళ్లు.. అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోడీ..