AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్‌ను దొంగలించాలనుకున్నారు.. కట్ చేస్తే చివర్లో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో!

మనకు వచ్చిన పనిని వదలకూడదు.. రాని పని జోలికి అస్సలు వెళ్లకూడదు. ఈ సామెత మీరూ వినే ఉంటారు. అసలు ఎందుకు ఇదంతా ఇప్పుడు చెబుతున్నానంటే..

Viral Video: బైక్‌ను దొంగలించాలనుకున్నారు.. కట్ చేస్తే చివర్లో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో!
Bike Stole
Ravi Kiran
|

Updated on: Feb 14, 2022 | 9:37 AM

Share

మనకు వచ్చిన పనిని వదలకూడదు.. రాని పని జోలికి అస్సలు వెళ్లకూడదు. ఈ సామెత మీరూ వినే ఉంటారు. అసలు ఎందుకు ఇదంతా ఇప్పుడు చెబుతున్నానంటే.. ఓ ఇద్దరు దొంగలు బైక్‌ను దొంగలించేందుకు విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి వట్టి చేతులతో నిష్క్రమించారు. ఎవరో చెప్పినట్లు దొంగతనం కూడా ఓ కళే. దాన్ని చేసేందుకు సరైన టెక్నిక్ అవసరం. కొన్నిసార్లు ఎంత తెలివిగా వ్యవహరించినా దొంగతనాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనల గురించి మీరు వినే ఉంటారు. న్యూస్ పేపర్లలో చదివి ఉంటారు. సరిగ్గా ఇదే సీన్ జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బైక్ దొంగతనం చేయడానికి వచ్చి ఇద్దరు దొంగలు తాళం రాకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఆ దృశ్యాలు సమీపంలోని ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నర్సాపురంలోని చిన మామిడిపల్లి నాగారమ్మ ఆలయం సమీపంలో ఉంచిన బైక్‌ను దొంగలించేందుకు ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు దొంగలు అక్కడికి చేరుకున్నారు. బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఆలయం వద్ద ఉంచిన సదరు మోటర్ సైకిల్‌ను దొంగిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దాని తాళం ఎంతకూ రాకపోవడంతో చివరకు అక్కడి నుంచి ఉసూరుమంటూ జారుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు నాగారమ్మ ఆలయంలోని సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. వాటిని ఆలయ కమిటీ సోషల్ మీడియా వేదిక విడుదల చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాహనాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ