‘Animal’ Movie Announcement Video : రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘యానిమల్’
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి. ఆతర్వాత ఈ యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ కు చెక్కేసి ఆక్కడ అర్జున్ రెడ్డి ..

Animal Announcement Video : టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి. ఆతర్వాత ఈ యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ కు చెక్కేసి ఆక్కడ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసాడు. స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరో గా కబీర్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇంతవరకు సందీప్ దర్శకత్వం వహించే మరో సినిమా పై క్లారిటీ రాలేదు. చాలా కాలంగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో సినిమా చేయాలని చూస్తున్నడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజగా ఆ వార్తలను నిజం చేసాడు. న్యూ ఇయర్ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాజగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమలో పరణితీ చోప్రా హీరోయిన్ గా నటించనుండగా, అనీల్ కపూర్, బాబి డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ టీజర్ లో రణ్ బీర్ తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని వివరించారు. ఇక ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, టీ సిరీస్, మరాద్ కేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
also read : Shruthi Tweet: గతేడాది ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.. అభిమానులకు మంచి సందేశం ఇచ్చిన శృతి..




