Garjana Movie Update: సస్పెన్స్ థ్రిల్లర్‌గా లక్షీరాయ్ ‘గర్జన’.. టీజర్ విడుదల చేసిన చిత్రయూనిట్..
లక్ష్మీ రాయ్ నటించిన గర్జన సినిమా టీజర్‌ను న్యూఇయర్ కానుకగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఇందులో లక్ష్మీ రాయ్‌కు జోడిగా నటుడు
లక్ష్మీ రాయ్ నటించిన గర్జన సినిమా టీజర్‌ను న్యూఇయర్ కానుకగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఇందులో లక్ష్మీ రాయ్‌కు జోడిగా నటుడు శ్రీకాంత్ నటించారు. అయితే కీలక పాత్రల్లో దెవ్ గిల్, నైర, వైష్ణవి నటించగా.. ఈ చిత్రానికి జె. ప్రతిభన్ దర్శకత్వం వహించారు.
తాజాగా విడుదలైన టీజర్ భయానకంగా చూపించారు. ఇందులో పులి మనుషులను వెటాడుతూ ఉండగా.. దానిని పట్టుకోవడానికి అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. సస్పెన్స్ థ్రిల్లర్‌తో కథాంశాన్ని రూపొందించినట్లుగా టీజర్‌ను తెలుస్తోంది. రక్తం మరిగిన పులికి చిక్కకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి లక్ష్మీ రాయ్ ప్రయత్నిస్తుంది. ఈ వీడియోతో సినిమా ఎంత ఆసక్తికరంగా ఉండబోతుందనేది అర్థమవుతోంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ గా సురేశ్ కొండటి చేస్తున్నారు. బి.వినోద్ జైన్ ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన గర్జన మోషన్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతోనైనా లక్ష్మీరాయ్ హిట్ అవుతుందో లేదో చుడాలి.