AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruthi Tweet: గతేడాది ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.. అభిమానులకు మంచి సందేశం ఇచ్చిన శృతి..

Shruthi Hasan NewYear Wishes: ఎన్నో కొత్త ఆశలతో అందరం కొత్తేడాదిలోకి అడుగుపెట్టాం. మానవ జీవితంలో 2020లో ఎదురైనన్ని సమస్యలు మరెప్పుడూ ఎదురుకాలేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా మహమ్మారి...

Shruthi Tweet: గతేడాది ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.. అభిమానులకు మంచి సందేశం ఇచ్చిన శృతి..
Narender Vaitla
|

Updated on: Jan 01, 2021 | 2:38 PM

Share

Shruthi Hasan NewYear Wishes: ఎన్నో కొత్త ఆశలతో అందరం కొత్తేడాదిలోకి అడుగుపెట్టాం. మానవ జీవితంలో 2020లో ఎదురైనన్ని సమస్యలు మరెప్పుడూ ఎదురుకాలేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. దీంతో ఈ కొత్తేడాదిలోనైనా అంతా మంచే జరగాలని ఆశిస్తూ అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.

శృతీ హాసన్ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ చేసిన ట్వీట్..

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులకు న్యూఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు. కమల్‌ గారాల పట్టి శృతీ హాసన్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా శృతి ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాదిలో మనమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ కొత్తేడాదిని సానుకూల దృక్పథంతో మొదలు పెడదాం.. ప్రతీ ఒక్కరం మార్పు తీసుకురావడానికి, ప్రేమను పంచడానికి.. బాధ్యతతో వ్యవహరిద్దాం. ప్రస్తుతం మనందరికీ ఇది ఎంతో అవసరం. మార్పు కోసం మనవంతు కృషి మనం చేస్తే.. కాలం సహకరిస్తుంది’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇక శృతీ హాసన్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2017లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమాలో కనిపించిన శృతీ హాసన్‌ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక శృతి 2020లో మూడు సినిమాలకు సైన్ చేయగా… వీటిలో రెండు సినిమాలు తెలుగు కావడం విశేషం. ఈ అమ్మడు నటిస్తోన్న ‘క్రాక్‌’ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుండగా. పవన్‌తో ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: New Year 2021: న్యూఇయర్ గిఫ్ట్‏గా ‘వరుడు కావలెను’ పోస్టర్ రివీల్.. రీతువర్మ, నాగశౌర్య లుక్ అదుర్స్..