Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్..’సింహాద్రి అప్పన్న’ సాక్షిగా తేల్చుకుందాం అంటూ ట్వీట్
సీఎం జగన్‌కు ట్విట్టర్‌లో సవాల్ విసిరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తనపై చేస్తోన్న ఆరోపణలన్నీ అబద్దాలని..ప్రమాణం చేయడానికి సిద్దమన్నారు.

Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు ట్విట్టర్‌లో సవాల్ విసిరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తనపై చేస్తోన్న ఆరోపణలన్నీ అబద్దాలని..ప్రమాణం చేయడానికి సిద్దమన్నారు. సీఎం జగన్ రెడీనా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. అప్పన్న సన్నిదికి వస్తే తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు లోకేశ్. సీఎం జగన్, విజయసాయి రెడ్డి తనపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో, వీరితో ఆరోపణలు చేయించే బదులు అప్పన్న సన్నిధికి వస్తే.. తేల్చకుందామన్నారు లోకేశ్.
అంతకముందు జర్నలిస్టులం అక్రిడిటేషన్ గురించి కూడా నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో ప్రస్తుతం 10 శాతం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి..మిగిలిన జర్నలిస్టులందరి మొండిచేయి చూపడం చాలా దారుణమన్నారు. అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కు అన్న లోకేశ్.. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరుఫున డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారని… జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారని లోకేశ్ ఆరోపించారు.
Also Read : MLC Challa Ramakrishnareddy : ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత.. విషాదంలో వైసీపీ నేతలు..
