అతి తక్కువ సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరంగా ‘2020’.. దశాబ్దంలోనే మొదటిసారి.. ఎన్ని చిత్రాలంటే ?..
కరోనా మహామ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. అటు థియేటర్లు మూతపడడం.. సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో సినీ కార్మికులు
కరోనా మహామ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. అటు థియేటర్లు మూతపడడం.. సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అంతేకాకుండా 2020 సంవత్సరంలో వరుస విషాదాలు సినీ పరిశ్రమను వెంటాడాయి. పలువురు సీనియర్ సెలబ్రెటీలు, యువ నటులను కొల్పోయింది కళామతల్లి. ఇక సినిమాల గురించి చూసుకుంటే ప్రతి సంవత్సరం చిన్న, పెద్ద సినిమాలు కలిపి దాదాపు 100 పైగా చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. 2020లో అతి తక్కువ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
గడిచిన పది సంవత్సరాల్లో చూసుకుంటే అతి తక్కువ సినిమాలు రిలీజ్ అయిన ఏడాది 2020. ఈసారి మొత్తం సినిమాలు 65. అందులో 50 చిత్రాలు తెలుగులో చిత్రీకరించగా.. 15 సినిమాలు డబ్బింగ్. ఈ పది సంవత్సరాల్లో విడుదలైన సినిమాలు చూసుకుంటే.. 2011లో 243 చిత్రాలు, 2012లో 224 కాగా.. 2013లో 270, 2014లో 276, 2015లో 245, 2016లో 266, 2017లో 245, 2018లో 228, 2019లో 269 సినిమాలు విడుదలయ్యాయి. ఇక కరోనా నామ సంవత్సరం 2020లో కేవలం 60 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ దశాబ్ధంలోనే అతి తక్కువ సినిమాలు రిలీజ్ అయినది ఈసారి మాత్రమే. దీన్ని బట్టి చూస్తే కరోనా మహామ్మారి సినీ ఇండస్ట్రీపైన ఎంతవరకు తన ప్రభావాన్ని చూపించిందనేది అర్థం చేసుకోవచ్చు.