ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దృశ్యం 2’ టీజర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. కన్ఫర్మ్ కానీ విడుదల తేదీ..

Drishyam 2 Teaser: మలయాళం హిట్ మూవీ 'దృశ్యం' సీక్వెల్‌గా 'దృశ్యం 2' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు..

ఆసక్తి రేకెత్తిస్తున్న 'దృశ్యం 2' టీజర్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. కన్ఫర్మ్ కానీ విడుదల తేదీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2021 | 1:29 PM

Drishyam 2 Teaser: మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఇక ప్రేక్షకుల కోసం న్యూఇయర్ కానుక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ టీజర్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కోవిడ్ కారణంగా కేరళలో ఇప్పటికీ థియేటర్లు తెరవకపోవడంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. మీనా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బేన‌ర్‌పై ఆంటోని పెరుంబ‌వూర్ నిర్మిస్తున్నారు.

కాగా, 2013లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, చైనీస్ భాషల్లో రీమేక్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.