మహేష్‌, పూరీ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ..!

బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌లు క్రియేట్ చేసిన మహేష్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం రానుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి.

మహేష్‌, పూరీ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 31, 2020 | 2:44 PM

Mahesh Babu Puri Jagannadh: బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌లు క్రియేట్ చేసిన మహేష్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం రానుందా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసేందుకు బడా నిర్మాత అనిల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అనిల్ సుంకరను కలిసి పూరీ ఆయనకు ఓ కథను చెప్పారట. అది సుంకరకు బాగా నచ్చిందట. (15 నెలల బంగారం చోరీ కేసు: దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌)

ఇక ఇందులో హీరోగా మహేష్‌ బాబుని సూచించారట అనిల్‌. అందుకు ఓకే చెప్పిన పూరీ.. త్వరలోనే మహేష్‌ని కలవబోతున్నట్లు సమాచారం. మరి ఈ స్టోరీ మహేష్‌కి నచ్చితే.. వీరి కాంబోలో మూడో చిత్రం రానుంది. కాగా ప్రస్తుతం మహేష్‌, పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి నటించబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. ఇక మరోవైపు ప్రస్తుతం విజయ్‌తో ఫైటర్‌ని తెరకెక్కిస్తోన్న పూరీ.. ఆ తరువాత బాలయ్యను మరోసారి డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ( మాల్దీవులకు పంపమన్న నెటిజన్‌.. సోనూ అదిరిపోయే రిప్లై)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu