AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR – Amit Shah: జూ.ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ వెనుక ఆంతర్యం అదేనా..? ‌సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చ

బీజేపీ అగ్రనేత అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..?

Jr NTR - Amit Shah: జూ.ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ వెనుక ఆంతర్యం అదేనా..? ‌సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చ
Amit Shah, NTR
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 23, 2022 | 4:20 PM

Share

బీజేపీ అగ్రనేత అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ వెనక  ఆంతర్యమేంటి..? ట్రిపుల్ ఆర్ కోసమే అయితే.. రామ్ చరణ్ లేకుండా స్పెషల్ మీటింగ్ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర నచ్చి.. అమిత్ షా ప్రశంసించారని తారక్ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది.

తారక్, అమిత్ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే.. రజాకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్ ఫైల్స్ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్, అమిత్ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్ ఫైల్స్ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్ ఫైల్స్ విషయంలో అమిత్ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి.