Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. ‘తెలుగోడి స్టైల్‌ మనమేలే బ్రాండ్‌’ అంటూ ఇరగదీస్తోంది..

Bunny Rap Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ రూటే సఫరేట్. సినిమా సినిమాకి ప్రత్యేకతను చూపిస్తూ యువతను అలరిస్తూ ఉంటాడు.

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న అల్లు అర్జున్ ర్యాప్ సాంగ్.. ‘తెలుగోడి స్టైల్‌ మనమేలే బ్రాండ్‌’ అంటూ ఇరగదీస్తోంది..
Follow us
uppula Raju

|

Updated on: Jan 12, 2021 | 12:05 PM

Bunny Rap Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ రూటే సఫరేట్. సినిమా సినిమాకి ప్రత్యేకతను చూపిస్తూ యువతను అలరిస్తూ ఉంటాడు. అందుకే అతడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. గత సంవత్సరం వచ్చిన అలా వైకుంఠపురంతో అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఆ సినిమా పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టించాయి.

టాలీవుడ్‌లో ప్రయోగాలు చేస్తూ సినిమాలు చేసే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్. ఆయనకు టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయన సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ర్యాప్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ‘తెలుగోడి స్టైల్‌..మనమేలే బ్రాండ్‌’ అంటూ సాగే ఈ ర్యాప్‌సాంగ్‌ను తెలుగు ర్యాప్‌ సింగర్‌ రోల్‌రైడా రచించి, ఆలపించగా సంగీత దర్శకుడు తమన్‌ కంపోజ్‌ చేశారు. బన్నీ మొదటి చిత్రం ‘గంగోత్రి’నుంచి ఇటీవల వచ్చిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం వరకు ఆయన పోషించిన పాత్రలు, పేల్చిన డైలాగులతో ఈ పాటను మలిచారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

‘వ్యక్తిగతంగా నా జీవితంలో ఓ సంఘటన జరిగింది’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్..