బన్నీ ప్రేమ, పెళ్లిపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతో 2011 మార్చి 6వ తేదిన ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరి జంటకు అల్లు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉంటోన్న ఈ జంట.. టాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో ఒకరిగా పేరొందారు. కాగా వీరిద్దరి పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు బన్నీ తండ్రి, […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతో 2011 మార్చి 6వ తేదిన ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరి జంటకు అల్లు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉంటోన్న ఈ జంట.. టాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో ఒకరిగా పేరొందారు. కాగా వీరిద్దరి పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఆయన సతీమణి నిర్మల.
స్నేహను ప్రేమించిన విషయాన్ని, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని బన్నీ ముందుగా తల్లి నిర్మలకు చెప్పాడట. దానికి వెంటనే నిర్మల స్పందిస్తూ.. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పిందట. ఇక ఆ తరవాత అరవింద్‌కు చెప్పగా.. స్నేహ తల్లిదండ్రులను వచ్చి మాట్లాడమని చెప్పాడట. ఇలా ఐదు నిమిషాల్లోనే బన్నీ ప్రేమకు, వివాహానికి అల్లు ఫ్యామిలీలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.
కాగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, సునీల్, సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.