Bachchala Malli OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ బచ్చల మల్లి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి వచ్చేసింది బచ్చల మల్లి సినిమా. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, అమృతా అయ్యార్ జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించాడు అల్లిరి నరేష్.

Bachchala Malli OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ బచ్చల మల్లి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Bachchala Malli Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 7:02 AM

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన లేటేస్ట్ మూవీ బచ్చలమల్లి. డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అల్లరి నరేష్‏లోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రంలో హనుమాన్ ఫేమ్ అమృతా అయ్యార్ కథానాయికగా నటించింది. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మరోసారి తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు అల్లరి నరేష్. ఇన్నాళ్లు థియేటర్ లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ అడియన్స్ ముందుకు తీసుకువచ్చింది.

థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‏లో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రి మాటలకు మనసు నొచ్చుకుని మూర్ఖుడిలా మారిన మల్లిని.. ఓ అమ్మాయి ప్రేమ ఎలా మార్చిందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూసేయ్యాల్సిందే. ఏపీలోని తుని దగ్గరలో ఉన్న సురవరం అనే ఊళ్లో జరిగిన కథగా ఈ మూవీని తెరకెక్కించారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల తర్వాత అల్లరి నరేష్ నటించిన లవ్ ఎంటర్టైనర్ బచ్చలమల్లి.

కథ విషయానికి వస్తే..

ఇవి కూడా చదవండి

చదువులో ఎంతో తెలివైన విద్యార్థి మల్లి (అల్లరి నరేష్). తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం ఎలా మొండి వ్యక్తిగా మారాడు ? ఆ తర్వాత అతడి జీవితంలోకి వచ్చిన కావేరి (అమృతా అయ్యార్) అనే అమ్మాయి ప్రేమ అతడిని ఎలా మార్చింది..? అసలు మల్లి తండ్రి చేసిన తప్పేంటీ ? మల్లి, కావేరి జీవితాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. ? అనేది ఈ చిత్రంలో చూడొచ్చు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.