బాలీవుడ్ ‘ఓ బేబీ’గా… అలియా భట్!

ముంబై: సమంత ప్రధాన పాత్రలో లేడి దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని హీరో రానా దగ్గుబాటి భావిస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపిస్తుందని సమాచారం. గతంలో ‘రాజీ’ అనే చిత్రం ద్వారా అలియా భట్ మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. తన నటనకు కూడా ప్రముఖుల […]

  • Updated On - 4:26 pm, Sat, 13 July 19
బాలీవుడ్ 'ఓ బేబీ'గా... అలియా భట్!

ముంబై: సమంత ప్రధాన పాత్రలో లేడి దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని హీరో రానా దగ్గుబాటి భావిస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపిస్తుందని సమాచారం.

గతంలో ‘రాజీ’ అనే చిత్రం ద్వారా అలియా భట్ మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. తన నటనకు కూడా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. కాబట్టి అలియా అయితేనే టైటిల్ రోల్ బాగా పండుతుందని రానా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న అలియా.. ఈ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.