బిగ్‌బాస్‌పై నటి సంచలన వ్యాఖ్యలు… పోలీసులకు ఫిర్యాదు!
హైదరాబాద్: ‘బిగ్ బాస్’… వివాదాలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా బుల్లితెరలో ప్రసిద్ధి గాంచిన రియాలిటీ షో. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. కొద్దిరోజుల్లో మూడు సీజన్‌కు తెర తీస్తోంది. ఇది ఇలా ఉండగా మూడో సీజన్ కోసం పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేసే క్రమంలో చోటు చేసుకున్న ఘటనలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఓ టీవీ ఛానల్ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
హైదరాబాద్: ‘బిగ్ బాస్’… వివాదాలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా బుల్లితెరలో ప్రసిద్ధి గాంచిన రియాలిటీ షో. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. కొద్దిరోజుల్లో మూడు సీజన్‌కు తెర తీస్తోంది. ఇది ఇలా ఉండగా మూడో సీజన్ కోసం పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేసే క్రమంలో చోటు చేసుకున్న ఘటనలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఓ టీవీ ఛానల్ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు షో నుంచి ఆఫర్ వచ్చిందని.. అయితే తాను బిగ్ బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తావంటూ ప్రశ్నించారని తెలిపింది. ఇది క్యాస్టింగ్ కౌచ్‌కు పక్కా నిదర్శనమని.. షోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ బంజారాహిల్స్ పోలీసులకు శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం జరిగి 24 గంటలు గడవకముందే.. నటి గాయత్రి గుప్తా తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు గుప్పించింది. తనకు బిగ్ బాస్ 2 నుంచి ఆఫర్ వచ్చిందని.. అప్పుడు దాని కోసం ఇంటర్వ్యూకు వెళ్లానని చెప్పుకొచ్చింది.
‘100 రోజులు సెక్స్‌కు దూరంగా ఉండగలవా’ అని అక్కడ ఉన్నవారు తనను ప్రశ్నించారని గాయత్రీ గుప్తా వెల్లడించింది. దీంతో తాను షోలో పార్టిసిపేట్ చేయలేదని స్పష్టం చేసింది. హౌస్‌లోకి వెళ్లిన నా స్నేహితులు కూడా నేను క్యాన్సిల్ చేసుకోవడం మంచిదైందని అన్నారని ఆమె తెలిపింది. అక్కడ జరుగుతున్న విషయాలను టీవీలో ప్రసారం చేయకుండా.. వాళ్ళు చూపించాలనుకున్న దృశ్యాలను మాత్రమే ప్లే చేస్తారని చెప్పింది. ప్రస్తుతం ఈ పరిణామాలు బిగ్ బాస్‌కు పాపులారిటీ తెచ్చి పెడుతున్నాయి. కాగా బిగ్ బాస్ 3 తెలుగులో ఈనెల 21 నుంచి ప్రసారం కాబోతోంది.