సినిమా చూసి మాట్లాడు బాస్..ఎక్స్‌పోజింగ్‌పై నెటిజన్‌కు నిధి కౌంటర్

హైదరాబాద్‌: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్స్‌గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది నిధి అగర్వాల్‌. ఈ ట్రైలర్‌ చూసి ఓ నెటిజన్‌ కాస్త ఓవర్‌గా కామెంట్‌ చేయగా, నిధి చాలా హుందాగా సమాధానం ఇచ్చింది. నిధి అగర్వాల్‌ ట్వీట్‌ చేసిన […]

సినిమా చూసి మాట్లాడు బాస్..ఎక్స్‌పోజింగ్‌పై నెటిజన్‌కు నిధి కౌంటర్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 13, 2019 | 5:29 PM

హైదరాబాద్‌: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్స్‌గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది నిధి అగర్వాల్‌. ఈ ట్రైలర్‌ చూసి ఓ నెటిజన్‌ కాస్త ఓవర్‌గా కామెంట్‌ చేయగా, నిధి చాలా హుందాగా సమాధానం ఇచ్చింది.

నిధి అగర్వాల్‌ ట్వీట్‌ చేసిన ట్రైలర్‌ను ఉద్దేశిస్తూ, సదరు నెటిజన్‌ ‘ఎక్స్‌పోజింగ్‌ కాకుండా ఇంకేమైనా చేశావా ఈ సినిమాలో’ అంటూ కాస్త వెటకారంగా కామెంట్‌ చేయడంతో నిధి కాస్త సంయమనంతోనే సమాధానం ఇచ్చింది. ‘చాలా చేశాను. ట్రైలర్‌ కాదు. మూవీ చూడు’ అంటూ చురకలంటించింది.