దాయాది దేశానికి చేరిన ‘సాహో’ ఫీవర్..!

హైదరాబాద్: ‘బాహుబలి’ రెండు పార్టుల తర్వాత హీరో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ క్రేజ్ దాయాది పాకిస్తాన్‌కు కూడా తాకింది. అసలు ఇది ఎందుకు చెబుతున్నానంటే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం యావత్తు భారతదేశం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి మొదటి పాట “సైకో సయాన్” […]

దాయాది దేశానికి చేరిన 'సాహో' ఫీవర్..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2019 | 5:50 PM

హైదరాబాద్: ‘బాహుబలి’ రెండు పార్టుల తర్వాత హీరో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ క్రేజ్ దాయాది పాకిస్తాన్‌కు కూడా తాకింది. అసలు ఇది ఎందుకు చెబుతున్నానంటే.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం యావత్తు భారతదేశం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా నుంచి మొదటి పాట “సైకో సయాన్” నాలుగు భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టుకుంది. ఇక ఈ పాట విన్న పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి “మవ్రా హొకెన్” తన ట్విట్టర్ ద్వారా ప్రభాస్ పేరు పెట్టి ట్వీట్ చేసింది. దీనితో ప్రభాస్ క్రేజ్ పాకిస్థాన్ వరకు చేరిందని ఆయన అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కాగా ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.