ముదురుతున్న కంగనా వ్యవహారం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జర్నలిస్టుల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. “జడ్జిమెంట్ హే క్యా” అనే చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీటీఐ‌కి చెందిన జర్నలిస్టుతో కంగనా గొడవపడ్డారు. అప్పటినుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ గొడవ కారణంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా కంగనాపై నిషేదం విధించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లోగా తనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే […]

ముదురుతున్న కంగనా వ్యవహారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 14, 2019 | 9:26 AM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జర్నలిస్టుల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. “జడ్జిమెంట్ హే క్యా” అనే చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీటీఐ‌కి చెందిన జర్నలిస్టుతో కంగనా గొడవపడ్డారు. అప్పటినుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ గొడవ కారణంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా కంగనాపై నిషేదం విధించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లోగా తనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అయితే తాను నటించిన మణికర్ణిక చిత్రానికి రివ్యూలు సరిగ్గా రాయలేదని కంగనా పీటీఐ జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. దీంతో కంగనాను నిషేదించారు. అదే సమయంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా కంగనా తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

జర్నలిస్టులతో జరిగిన వివాదం విషయంలో తన క్లైంట్‌కు మీ వల్ల ఎంతో పరువునష్టం కలిగిందని, వెంటనే సంజాయిషీ ఇచ్చుకోవాలని , 24 గంటల్లోగా ఆమెపై నిషేదాన్ని ఎత్తివేయాలని.. లేదంటే భారీ నష్టపరిహారం వసూలు చేయల్సి వస్తుందని కంగనా తరపు లాయర్ రిజ్వాన్ సిద్ధికి నోటీసులు జారీ చేశారు.