పొలిటికల్ ఎంట్రీపై క్లారీటీ ఇచ్చిన అక్షయ్ కుమార్..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు కూడా ఉపందుకున్నాయి. దీంతో.. వీటికి చెక్ పెడుతూ అక్షయ్ కుమార్ స్పందించారు. సినిమాల ద్వారానే రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నానని.. ఎన్నికల్లో పోటీచేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. సినిమాల వల్లనే ప్రజల్లో చైతన్యం కలగాలి.. మార్పులు తీసుకురావాలని అన్నారు అక్షయ్. కాగా.. నేను నటించిన టాయ్ లెట్ ఏక్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:53 am, Sat, 16 March 19
పొలిటికల్ ఎంట్రీపై క్లారీటీ ఇచ్చిన అక్షయ్ కుమార్..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు కూడా ఉపందుకున్నాయి. దీంతో.. వీటికి చెక్ పెడుతూ అక్షయ్ కుమార్ స్పందించారు. సినిమాల ద్వారానే రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నానని.. ఎన్నికల్లో పోటీచేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. సినిమాల వల్లనే ప్రజల్లో చైతన్యం కలగాలి.. మార్పులు తీసుకురావాలని అన్నారు అక్షయ్.

కాగా.. నేను నటించిన టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రం ద్వారా దేశంలో చాలా మార్పులు వచ్చాయని.. అలాగే.. ప్యాడ్ మ్యాన్ సినిమాతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం మార్పులు వచ్చాయని తెలిపారు.