‘ఖడ్గం’ సంగీత రీ ఎంట్రీ

సంగీత ఒకప్పుడు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా సంగీత ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలో ‘ఖడ్గం’ ముందు వరుసలో నిలుస్తుంది. వెండితెరపై కనిపించాలనే ఆశతో పల్లె నుంచి పట్నానికి వచ్చి ‘ఒకే ఒక్క ఛాన్స్’ ఇవ్వమని అడిగే అమాయకపు యువతిగా ఆమె పోషించిన పాత్ర బాగా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అలాంటి సంగీత పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె ‘తమిళ […]

  • Publish Date - 11:54 am, Sat, 16 March 19 Edited By:
'ఖడ్గం' సంగీత రీ ఎంట్రీ

సంగీత ఒకప్పుడు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా సంగీత ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలో ‘ఖడ్గం’ ముందు వరుసలో నిలుస్తుంది. వెండితెరపై కనిపించాలనే ఆశతో పల్లె నుంచి పట్నానికి వచ్చి ‘ఒకే ఒక్క ఛాన్స్’ ఇవ్వమని అడిగే అమాయకపు యువతిగా ఆమె పోషించిన పాత్ర బాగా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

అలాంటి సంగీత పెళ్లి తరువాత సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. మళ్లీ ఇప్పుడు ఆమె ‘తమిళ రసన్’ అనే తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. విజయ్ ఆంటోని .. రమ్య నంబిసన్ హీరో, హీరోయిన్ లుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సంగీత ఒక కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ ప్రాజెక్టును గురించి సంగీత మాట్లాడుతూ .. ” పెళ్లి తరువాత కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అవి అంతగా నచ్చకపోవడం వలన పక్కన పెట్టేశాను. ఈ సినిమాలో నా కోసం అనుకున్న పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన .. కొత్తగా అనిపించడం వలన అంగీకరించాను” అని చెప్పుకొచ్చింది. మొత్తానకి సంగీత తన వివాహం తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.