‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాపై కెప్టెన్ గోపినాధ్ ప్రశంసలు.. గుండెను తాకిందంటూ ట్వీట్..

కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఆకాశమే నీ హద్దురా'. ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగర ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాధ్...

'ఆకాశమే నీ హద్దురా' సినిమాపై కెప్టెన్ గోపినాధ్ ప్రశంసలు.. గుండెను తాకిందంటూ ట్వీట్..
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 22, 2020 | 12:50 PM

Aakasame Ne Haddura: కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగర ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాధ్ జీవితకథ ఆధారంగా రూపొందించింది. దీపావళి కానుక ఈ మూవీ నవంబర్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రానికి అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని.. సూర్య అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాథ్ స్పందించారు.

”నా జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతీ సన్నివేశం గుండెను తాకింది. ఓ యువ పారిశ్రామికవేత్త తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పడిన ఇబ్బందులు.. తన భార్య సహకారం.. ఇలా అన్నింటితో సినిమా సాగిన తీరు చాలా బాగుంది. దర్శకురాలు సుధా కొంగరకు, నటీనటులు సూర్య, అపర్ణ బాలమురళికి కృతజ్ఞతలు’ అని చెబుతూ కెప్టెన్ గోపినాధ్ ట్వీట్ చేశారు.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..