Samantha Chaitanya: విడాకుల తర్వాత తొలిసారి ఒకేచోట సమంత, నాగచైతన్య.. ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికైన..
Samantha Naga Chaitanya: నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడముచ్చటి ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో అటు ఇండస్ట్రీతో పాటు..
Samantha Naga Chaitanya: నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడముచ్చటి ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో అటు ఇండస్ట్రీతో పాటు, ఇటు వారి అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇక ఈ జంట విడాకులు తీసుకొని మూడు నెలలకు కావస్తున్నా ఇప్పటికీ వీరి అంశం వైరల్‌గా మారుతూనే ఉంది. అసలు తమ విడాకులకు కారణమేంటన్న విషయాన్ని ఈ జంట ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ జంట విడాకుల తర్వాత ఇంత వరకు తారసపడలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఆ సమయం రానే వచ్చింది. సమంత, నాగచైతన్యలు ఇద్దరు ఒకేచోట అనుకోకుండా ఉండాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు సినిమా షూటింట్‌లో బిజీగా ఉండగా, సమంత యశోద సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం ఈ రెండు చిత్రాల షూటింగ్ రామనాయుడు స్టూడియోలో జరిగింది. దీంతో అనుకోని పరిస్థితుల్లో చై, సామ్ ఒకే చోట ఉండాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ఒకేచోట ఉన్నా కనీసం ఒకరిని ఒకరు చూసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయం ముందుగానే తెలిసిన జంట ఒకరికి ఒకరు తారసపడకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. చై, సామ్ ఇద్దరూ తమ షూటింగ్‌ను పూర్తి చేసుకొని ఒకరికొరు తారసపడకుండానే స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారని, ఈ విషయమై తమ సిబ్బందికి డైరెక్షన్స్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.
IND vs SA: టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్.. ఐదుగురు బౌలర్లతో బరిలోకి..
Papaya Seed benefits: బొప్పాయి గింజలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే..