Allu Sirish: ఈరోజు కోసం 14 సంవత్సరాలు ఎదురుచూశాను.. అల్లు శిరిష్ ఎమోషనల్ పోస్ట్..

అల్లు శిరీష్.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు

Allu Sirish: ఈరోజు కోసం 14 సంవత్సరాలు ఎదురుచూశాను.. అల్లు శిరిష్ ఎమోషనల్ పోస్ట్..
Allu Sirish
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2021 | 3:35 PM

అల్లు శిరీష్.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. ప్రస్తుతం శిరీష్ ముంబైలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రేమ కాదంటా ? ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమాన్యుయేల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే..గత కొద్ది రోజుల నుంచి సైలెంట్‏గా అల్లు శిరీష్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో జెర్సీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముంబైలోని రోడ్డు పక్కన జెర్సీ మూవీ హోర్డింగ్‏లో అల్లు ఎంటర్‏టైన్మెంట్స్ అని ఉండడం చూసి ఎమోషనల్ అయ్యాడు. అల్లు ఎంటర్‏టైన్మెంట్స్ అని జుహు సర్కిల్లో ఓ హోర్డింగ్ లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అంటూ రాసుకొచ్చాడు అల్లు శిరీష్. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రాన్ని హిందీలో దిల్ రాజు, అల్లు శిరీష్, నాగవంశీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..