IND vs SA: టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్.. ఐదుగురు బౌలర్లతో బరిలోకి..
సెంచూరియన్ మైదానంలో భాతత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్ టాస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
సెంచూరియన్ మైదానంలో భాతత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత్ టాస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ వెల్లడించాయి. భారత తుది జట్టులో పుజారా, పంత్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగింది.
5వ నెంబర్లో బ్యాటింగ్ చేయడానికి టీం మెనేజమెంట్ రహానేపై విశ్వాసం ఉంచింది. అతని అనుభవానికి విలువనిచ్చింది. తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీకి చోటు దక్కలేదు. ఐదుగురు బౌలర్లతో భారత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అశ్విన్, బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ సహా ఐదుగురు బౌలర్లు తుది జట్టులో ఉన్నారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో చోటు దక్కలేదు.
భారత ప్లేయింగ్ XI
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్, ఆర్. అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడాన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రోసీ వాన్ డెర్ దుసాయి, టెంబా బౌమా, క్వింటన్ డి కాక్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, మార్కో యాన్సన్
Read Also.. Boxing Day Test Match: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి?.. పూర్తి చరిత్ర తెలుసుకోండి..