AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA, 1st Test, Day 1 Highlights: ముగిసిన తొలి రోజు ఆట.. రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌..

IND vs SA, 1st Test: సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆటమొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే..

IND vs SA, 1st Test, Day 1 Highlights: ముగిసిన తొలి రోజు ఆట.. రాణించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌..
Rahul
Narender Vaitla
|

Updated on: Dec 26, 2021 | 9:02 PM

Share

IND vs SA, 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు భారత ఓపెనర్లు మంచి ఓపెనింగ్‌ను అందించారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఆటతీరుతో భారత స్కోరును ఉరుకులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 248 బంతుల్లో 122 పరుగలు సాధించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ కూడా తనదైన ఆటతీరును కనబరిచి 123 బంతుల్లో 60 పరుగులతో రాణించాడు. అయితే అనంతరం బరిలోకి దిగిన పుజారా డకౌట్‌ అయి నిరాశ పరిచాడు.

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 35 పరుగులకు వెనుతిరిగాడు. ఇక రహానే రాహుల్‌తో జత కలిసి స్కోరును పెంచాడు. ఈ క్రమంలోనే రహానే 40 పరుగులు సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద ఉంది. క్రీజులో రహానే (40), కేఎల్‌ రాహుల్‌ (122) పరుగులతో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను గెలవకపోవడం గమనార్హం. మరిఈసారైనా ఆ సంప్రదయానికి టీమిండియా శుభం పలకనుందో చూడాలి. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు బలంగా కనిపించడంలేదు. గత కొన్నేళ్లుగా సౌతాఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఇది మంచి అవకాశంలా కనిపిస్తోంది. మరి కోహ్లీ సేన ఈ అవకాశాన్ని అందుపుచ్చుకుంటుందో లేదో చూడాలి.

తొలి టెస్ట్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ ఇక్కడ చూడండి..

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Dec 2021 09:00 PM (IST)

    ముగిసిన తొలి రోజు ఆట..

    సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు భారత ఓపెనర్లు మంచి ఓపెనింగ్‌ను అందించారు. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఆటతీరుతో భారత స్కోరును ఉరుకులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 248 బంతుల్లో 122 పరుగలు సాధించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ కూడా తనదైన ఆటతీరును కనబరిచి 123 బంతుల్లో 60 పరుగులతో రాణించాడు. అయితే అనంతరం బరిలోకి దిగిన పుజారా డకౌట్‌ అయి నిరాశ పరిచాడు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 35 పరుగులకు వెనుతిరిగాడు. ఇక రహానే రాహుల్‌తో జత కలిసి స్కోరును పెంచాడు. ఈ క్రమంలోనే రహానే 40 పరుగులు సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద ఉంది. క్రీజులో రహానే (40), కేఎల్‌ రాహుల్‌ (122) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 26 Dec 2021 08:01 PM (IST)

    శతకం బాదిన రాహుల్‌..

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభాన్ని అందించాడు. మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరు పెంచడంతో పాటు వ్యక్తిగత స్కోరును కూడా పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే కేఎల్‌ రాహుల్‌ సెంచరీ బాదేశాడు. 218 బంతుల్లో ఫోర్లు, సిక్స్‌తో సెంచరీ సాధించాడు. ఇక ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (103), రహానే (25) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 26 Dec 2021 07:30 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    విరాట్‌ కోహ్లీ రూపంలో టీమిండియా మరో వికెట్‌ కోల్పోయింది. 35 పరగుల వద్ద కోహ్లీ ఎన్గిడి బౌలింగ్‌లో మల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం రహానే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 26 Dec 2021 07:05 PM (IST)

    70 పరుగులు దాటిన భాగస్వామ్యం..

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయి స్కోరు బోర్డులో వేగం తగ్గిన టీమిండియాను రాహుల్‌, కోహ్లీ ఆదుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 65 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 187/2 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కోహ్లీ (34), కేఎల్ రాహుల్‌ (80) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 26 Dec 2021 06:21 PM (IST)

    టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్‌ ఎంతంటే..

    టీ విరామం సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 157 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (68), కోహ్లి (19) పరుగులతో కొనసాగుతున్నారు. ఇక మొదట్లో దూకుడుగా కొనసాగిని టీమిండియా స్కోర్‌ తర్వాత నెమ్మదించింది. ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్‌లలో టీమిండియా కేవలం 4 పరుగులే సాధించింది.

  • 26 Dec 2021 05:28 PM (IST)

    అర్థశతకం పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌..

    కేఎల్‌ రాహుల్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 9 ఫోర్లతో రాహుల్ 50 పరుగులు దాటేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 126 పరుగల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లీ (05), కేఎల్‌ రాహుల్‌ (52) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 26 Dec 2021 05:13 PM (IST)

    రెండో వికెల్‌ కోల్పోయిన టీమిండియా..

    ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా దూసుకుపోతున్న టీమిండియాను సౌతాఫ్రిక బౌలర్‌ ఎన్గిడి వరుస వికెట్లతో ఢీలా పడేలా చేశాడు. అగర్వాల్‌ అవుట్‌ అయిన కొద్ది క్షణాలకే పూజారా అవుట్‌ అయ్యాడు. ఎన్గిడి బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన పూజారా.. కీగన్ పీటర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుతిరిగాడు.

  • 26 Dec 2021 05:11 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..

    భారత్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందించిన ఓపెనర్లను సౌతాఫ్రిక బౌలర్‌ ఎన్గిడి విడదీశారు. 60 పరుగులతో మంచి ప్రారంభాన్ని అందించిన మయాంక్‌ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనుతిరిగాడు.

  • 26 Dec 2021 04:18 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అగర్వాల్‌..

    మయాంక్‌ అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. తొలి నుంచి దూకుడుగా ఆడుతోన్న అగర్వాల్‌ స్కోరు బోర్డ్‌ను పరుగులు పెట్టించే క్రమంలో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అగర్వాల్ కు ఇది టెస్ట్ కెరీర్ లో ఇది 6వ హాఫ్ సెంచరీ. దీంతో అగర్వాల్‌, రాహుల్‌ల భాగస్వామ్యం 90 పరుగులకు చేరుకుంది.

  • 26 Dec 2021 04:03 PM (IST)

    టీమిండియాకు మంచి స్టార్టింగ్‌..

    ఓపెనర్లు రాణించడంతో టీమిండియాకు మంచి ప్రారంభం లభించింది. తొలి టెస్ట్‌ తొలిరోజు భారత ఓపెనర్లు బాగా ఆడడంతో టీమిండియా ఒక్క వికెట్ నష్టపోకుండా దూసుకుపోతోంది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి 83 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో అగర్వాల్‌ (46), రాహుల్‌ (29) పరుగులతో కొనసాగుతున్నారు.

  • 26 Dec 2021 03:34 PM (IST)

    దూకుడుగా ఆడుతోన్న అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువలో..

    ఓపెనర్లు టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మయాంక్‌ అగర్వాల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం 46 పరుగుల వద్ద కొనసొగుతున్నాఉ. ఇక రాహుల్‌ కూడా సమయం దొరికినప్పుడల్లా స్కోరు పెంచేస్తున్నాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు గాను టీమిండియా 83/0 వద్ద కొనసాగుతోంది.

  • 26 Dec 2021 02:50 PM (IST)

    50 మార్కును చేరుకున్న టీమిండియా స్కోర్..

    తొలి టెస్ట్‌లో టీమిండియాకు శుభారంభం వచ్చింది. ఇద్దరు ఓపెనర్లు నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా స్కోరు పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్‌ స్కోర్‌ 50 మార్కును చేరుకుంది. ఓవర్లకు ఇండియా స్కోర్‌ ఒక్క వికెట్‌ నష్టపోకుండా 52 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (16), అగర్వాల్‌ (36) పరుగులతో ఉన్నారు.

  • 26 Dec 2021 02:28 PM (IST)

    దూకుడుగా ఆడుతోన్న టీమిండియా ఓపెనర్లు..

    సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, అగర్వాల్‌ మంచి ప్రారంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే జట్టుస్కోరు పెంచుకుంటూ పోతున్నారు. 13 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా టీమిండియా 42 స్కోర్‌ వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (16), అగర్వాల్‌ (26) పరుగులతో కొనసాగుతున్నారు.

Published On - Dec 26,2021 2:21 PM