IND VS SA: సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. 14 ఏళ్ల కరువును తీర్చిన భారత ఓపెనర్..!
KL Rahul: కేఎల్ రాహుల్ సెంచూరియన్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సెంచరీ చేసిన ఘనత సాధించాడు.
India vs South Africa: సెంచూరియన్ టెస్టు తొలి రోజునే భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత తన వ్యక్తిగత స్కోర్‌ను కూడా సెంచరీకి తీసుకెళ్లాడు. దక్షిణాఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్ తొలిసారి సెంచరీ సాధించాడు. సెంచూరియన్‌లోని కష్టతరమైన పిచ్‌పై కేఎల్ రాహుల్ ఖాతా తెరవడానికి 21 బంతులు తీసుకున్నాడు. ఆ తరువాత సహనంతో సెంచురీయన్‌లో బరిలోకి దిగి తన 7వ టెస్ట్ సెంచరీని చేరుకోగలిగాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. 14 ఏళ్ల క్రితం 2007లో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ టెస్టులో వసీం జాఫర్ సెంచరీ సాధించాడు. కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
మయాంక్ అగర్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ 17.3 ఓవర్లలో టీమ్ ఇండియా స్కోరును 50 పరుగులకు చేర్చారు. లంచ్ సమయానికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ జట్టు స్కోరును 83 పరుగులకు చేర్చారు. రెండో సెషన్‌లో మయాంక్‌తో కలిసి రాహుల్ భారత్ స్కోరును 100 దాటించాడు. ఈ సమయంలో, మయాంక్ అగర్వాల్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే అగర్వాల్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాతి బంతికే పుజారా కూడా సున్నాకి ఔటయ్యాడు. ఈ సమయంలో, రాహుల్ 127 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
కెప్టెన్ కోహ్లితో కలిసి కేఎల్ రాహుల్ భారత స్కోరును 150 దాటించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ 118 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. అయితే 200 పరుగుల ముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్ క్రీజులో కొనసాగుతూ 218 బంతుల్లో 7వ టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ విదేశీ గడ్డపై 7 సెంచరీలలో 6 సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌లో 2, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఒక్కో సెంచరీ సాధించాడు. గత రెండేళ్లలో భారత్ తరపున కేఎల్ రాహుల్ 4 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ 3 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ తన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లాడు. దీంతో టీమ్ ఇండియాకు ఎంతో మేలు జరుగుతోందని స్పష్టమవుతోంది.
?? ?@klrahul11
pic courtesy – CSA pic.twitter.com/mm98BjErTI
— BCCI (@BCCI) December 26, 2021
Stumps on Day 1 of the 1st Test.
A brilliant ton from @klrahul11 as #TeamIndia end the first day on 272/3.
Scorecard – https://t.co/eoM8MqSQgO #SAvIND pic.twitter.com/WwXgVoZd9B
— BCCI (@BCCI) December 26, 2021
What’s Centurion’s Mr. Centurion up to inside a car? ??
A special interview coming up on https://t.co/Z3MPyesSeZ ?️⌛@klrahul11 | #TeamIndia | #SAvIND pic.twitter.com/LRUlbVifXQ
— BCCI (@BCCI) December 26, 2021
Also Read: IND vs SA: టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్.. ఐదుగురు బౌలర్లతో బరిలోకి..
Ashes Series 2021-22: 185 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. రాణించిన లియాన్, స్టార్క్..