Nikhil Siddharth: టికెట్స్ రేట్లపై హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్.. ట్రైన్ టికెట్స్‏తో పోలుస్తూ..

థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసింది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో థియేటర్లకు జనాలు రావడం ప్రారంభించారు.

Nikhil Siddharth: టికెట్స్ రేట్లపై హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్.. ట్రైన్ టికెట్స్‏తో పోలుస్తూ..
Nikhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2021 | 3:10 PM

థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసింది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో థియేటర్లకు జనాలు రావడం ప్రారంభించారు. దీంతో థియేటర్ యాజమానులు.. ప్రొడ్యూసర్స్ ఊపిరిపిల్చుకున్నారు. ఇక అఖండ, పుష్ప వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో మిగిలిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది దాదాపు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలో మరోసారి థియేటర్స్ యాజమాన్యాలకు.. ప్రొడ్యుసర్స్‏కు మరో చిక్కు వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుపై థియేటర్స్ యాజమానులు, ప్రొడ్యూసర్స్ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి పునరాలోచించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు టికెట్స్ రేట్స్ తగ్గిపోవడంతో ఆంధ్రప్రదేశ్ పలు చోట్లు థియేటర్లు మూతపడుతున్నాయి. టికెట్స్ రేట్స్ తగ్గిపోవడంతో థియేటర్లను నడపలేమంటూ మూసివేస్తున్నారు యాజమానులు.

అయితే ఏపీలో థియేటర్లు మూతపడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ యాజమానులకు, ప్రొడ్యూసర్స్‏కు గుడ్ న్యూస్ అందించింది. సినిమా విడుదల సమయంలో టికెట్స్ రేట్ పెంచుకోవచ్చు అంటూ జీవో జారీచేసింది. దీనిపై సినీ పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. టికెట్స్ రేట్స్ విషయంపై తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో.. థియేటర్స్ నాకు గుడితో సమానం.. ఎప్పుడు ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాంటి థియేటర్స్ మూతపడడం చూస్తుంటే గుండె పగిలిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు చూస్తుంటే సంతోషంగా ఉంది. అదే విధంగా థియేటర్స్ మళ్లీ కళ కళలాడేలా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

అలాగే నాకు తెలిసి ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ. 20 టికెట్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి. మనం ప్రయాణించే ట్రైన్స్ లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్ మెంట్స్ ఉంటాయి కదా.. అలాగే థియేటర్లలోని బాల్కానీ, ప్రీమియమ్ సెక్షన్స్ సీట్స్ కు కాస్త టికెట్ ధర పెంచాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. ఇదిలా ఉంటే.. నిఖిల్ ప్రస్తుతం 18 పేజీస్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

ఈ చిన్ని కృష్ణుడు.. ఇప్పుడు చిలిపి భామ.. కుర్రాళ్ళ మనసులు దోచేసిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..