AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Trailer: అద్భుతం.. మహా అద్భుతం.. ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల.. పండగ చేసుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

Adipurush Telugu Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Adipurush Trailer: అద్భుతం.. మహా అద్భుతం.. ఆదిపురుష్‌ ట్రైలర్‌ విడుదల.. పండగ చేసుకుంటున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..
Adipurush Official Trailer
Shaik Madar Saheb
|

Updated on: May 09, 2023 | 2:49 PM

Share

Adipurush Telugu Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఇతిహాసగాథ ‘ఆది పురుష్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఆదిపురుష్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సినీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి (రాఘవుడు) ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు.

ఇదిలాఉంటే.. ఏఎమ్‌బీ మాల్‌లో ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఆదిపురుష్‌ ట్రైలర్‌ను స్ట్రీమింగ్‌ చేశారు. ట్రైలర్‌ను చూసిన వారంతా.. అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. టీజర్‌ కన్నా వంద రెట్లు ట్రైలర్‌ మెరుగ్గా ఉందని, విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయంటూ హర్షం చేశారు.

ఆదిపురుష్‌ టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్‌ ట్రైలర్‌తో ఆకట్టుకుంటారా.. లేదా..? అనే ప్రశ్నలల మధ్య.. ట్రైలర్ విడుదల కావడం అలాగే సినీ ప్రేక్షకుల నుంచి రెట్టింపు స్పందన లభిస్తుండటంతో గతంలో ఉన్న అన్ని నెగటివిటీలను దూరం చేసింది.

ఇవి కూడా చదవండి

ఆదిపురుష్ ట్రైలర్ చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం..