Trisha: వీధుల్లో సైకిల్‌ సవారీ చేస్తోన్న చెన్నై చిన్నది.. సైక్లింగ్‌ వెనక ఉన్న సీక్రెంట్‌ ఏంటో చెప్పిన త్రిష.

Trisha: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే ఏ మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది అందాల తార త్రిష. కోట్లాది మంది యువకుల హృదయాల్లో...

Trisha: వీధుల్లో సైకిల్‌ సవారీ చేస్తోన్న చెన్నై చిన్నది.. సైక్లింగ్‌ వెనక ఉన్న సీక్రెంట్‌ ఏంటో చెప్పిన త్రిష.
Trisha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 16, 2021 | 1:59 PM

Trisha: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికే ఏ మాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది అందాల తార త్రిష. కోట్లాది మంది యువకుల హృదయాల్లో గూడుకట్టుకున్న త్రిష ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది ఒకానొక సమయంలో రెండు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్‌ స్థానాన్ని అందుకుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ అవకాశాలను సొంతం చేసుకుంటోంది త్రిష. ఇక 38 ఏళ్ల వయసులోనూ రవ్వంతైనా తగ్గని అందంతో ఆకట్టుకుంటోందీ చిన్నది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

త్రిష చెరగని అందానికి సీక్రెట్‌ వర్కవుట్స్‌ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే నిత్యం యోగా, వర్కవుట్లతో శారీరక ఆరోగ్యంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకునే త్రిష.. తాజాగా సైకిల్‌ సవారీ చేసింది. కళ్లకు గాగుల్స్‌, తలపై హెల్మెట్‌ ధరించిన ఈ చిన్నది ఎంచక్కా చెన్నై నగర వీధుల్లో సైకిల్‌పై సవారి చేసింది. కరోనా నేపథ్యంలో త్రిష మొహానికి మాస్కు కూడా ధరించింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన త్రిష.. ‘మంచి మూడ్‌ను సొంతం చేసుకునేందుకు మీరు కేవలం ఒక రైడ్‌ దూరంలో ఉన్నారు. ఇది నా కొత్త అలవాటు’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ రాసుకొచ్చింది. అంటే సైక్లింగ్‌తో కేవలం శారీరక ఆనందమే కాకుండా మానసిక ఆనందం కూడా సొంతం చేసుకోవచ్చనేదీ త్రిష ఉద్దేశన్నమాట.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇక ఈ ఫొటోతో పాటు త్రిష తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరో ఫొటో షేర్‌ చేసింది. ఈ ఫొటోలో చీర కట్టులో ఉన్న త్రిష తన అందంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. తన సెల్ఫీ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘పర్‌ఫక్ట్‌గా ఉండడానికి చింతిచకు.. కేవలం నిజాయితీగా మాత్రమే ఉండు చాలు’ అని ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో చూసిన త్రిష అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: Vijay Sethupathi: నాడు అన్నం కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసిన.. నేటి దక్షిణాది విలక్షణ నటుడు

T-Series Bhushan Kumar : టి- సిరీస్ హెడ్ భూషణ్ కుమార్‌పై అత్యాచారం ఆరోపణలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు..

Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..