Sharmeen Akhee: సినిమా షూటింగ్‌లో భారీ పేలుడు.. మంటల్లో చిక్కుకుని ప్రముఖ నటి పరిస్థితి విషమం
కమలహాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగి పలువురు మరణించిన సంఘటన ఇప్పటికీ మరవలేం. ఇక రెండు రోజుల క్రితం ప్రముఖ నటి సన్నీ లియోన్ షూటింగ్‌లో గాయపడింది.
సినిమా సెట్‌లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. కమలహాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగి పలువురు మరణించిన సంఘటన ఇప్పటికీ మరవలేం. ఇక రెండు రోజుల క్రితం ప్రముఖ నటి సన్నీ లియోన్ షూటింగ్‌లో గాయపడింది. ఆమె కాలి బొటన వేలుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన మరువక ముందే మరో ప్రముఖ నటి సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురైంది. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ నటి షర్మీన్ అకీ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కాగా ఆమె తాజాగా మీర్‌పుర్‌లో షూటింగ్‌లో ఉండగా.. మేకప్ రూంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో సెట్‌లో మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే షర్మీన్ కూడా మంటల్లో చిక్కుకుంది. దీంతో ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను షైఖ్ హసీనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. రక్తంలోని ప్లాస్మా కణాల సంఖ్య దారుణంగా పడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. షర్మీన్ శరీరం 35 శాతం వరకు కాలిపోయిందని, చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
కాగా ప్రస్తుతం షర్మీన్‌ను హై డిపెండెన్సీ యూనిట్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల షర్మీన్ బంగ్లాదేశ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటి.’సిన్సియర్లీ యువర్స్, ఢాకా’, ‘బాయిసే స్రాబన్ అండ్ బాందిని’ సినిమాలతో బంగ్లా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీషోల ద్వారా బుల్లితెరపైనా సందడి చేసింది. సినిమా ఇండస్ట్రీలో బోలెడు భవిష్యత్ ఉన్న ఈ తార అకస్మాత్తుగా ప్రమాదం బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.