Sameera Reddy: బరువు తగ్గేందుకు సమీరా ఏం చేస్తుందో చూడండి.! చిన్నారులతో కలిసి వర్షం సైతం లెక్క చేయకుండా.

Sameera Reddy: బరువు పెరగడం ఇటీవల చాలా సర్వ సాధారమైన విషయం. మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా...

Sameera Reddy: బరువు తగ్గేందుకు సమీరా ఏం చేస్తుందో చూడండి.! చిన్నారులతో కలిసి వర్షం సైతం లెక్క చేయకుండా.
Sameera Reddy
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Jul 16, 2021 | 11:42 AM

Sameera Reddy: బరువు పెరగడం ఇటీవల చాలా సర్వ సాధారమైన విషయం. మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా తల్లులుగా మారిన మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. నటి సమీరా రెడ్డి కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్నారు. అయితే సమీరా ఈ విషయంలో ఢీలా పడకుండా కఠోర శ్రమతో తిరిగి బరువు తగ్గారు. ఈ క్రమంలో తాను బరువు ఎలా తగ్గుతున్నానో వివరిస్తూ ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు సమీరా. ‘ఫిట్‌నెస్‌’ గోల్‌ పేరుతో వరుసగా పోస్ట్‌లు చేస్తున్నారీ సూపర్‌ మామ్‌. బరువు తగ్గే క్రమంలో యోగా చేయడం, సరైన డైట్ మెయింటెన్‌ చేయడం వంటివి తనకు ఉపయోగపడ్డాయని సమీరా తెలిపారు.

ఈ క్రమంలో ఇప్పటికే తన శరీరంలో చాలా మార్పులు సాధించుకున్న సమీరా.. తన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇందులో భాగంగా సమీరా తన ఇద్దరు పిల్లలతో కలిసి వర్కవుట్స్‌ చేస్తోన్న వీడియోను షేర్‌ చేశారు. ఇక ఫిట్‌గా మారడానికి తాను చేస్తున్న వర్కవుట్స్‌ను వివరిస్తూ.. స్కిప్పింగ్‌, రన్నింగ్‌ ప్రారంభించానని తెలిపారు. ఇది కష్టంగా ఉన్నా చేయాల్సిందేనని రాసుకొచ్చారు. ఇక వర్షం పడుతోన్నా అలాంటి సాకులు చెప్పకుండా వర్కవుట్‌ చేస్తున్నానని సమీరా తెలిపారు. వచ్చే దీపావళిలోగా తన శరీర బరువును మరింత తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న సమీరా ఆ క్రమంలో భారీగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

సమీరా రెడ్డి చేసిన పోస్ట్‌..

ఇక సమీరా సినీ కెరీర్‌ విషయానికొస్తే.. 2002లో వచ్చిన ‘మైనే దిల్‌ తుజ్‌కో దియా’ బాలీవుడ్‌ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2005లో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ‘నరసింహుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సమీరా. తర్వాత హిందీ, తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే 2014, జనవరి 21న అక్షయ్‌ వర్దే అనే పారిశ్రామిక వేత్తను వివాహం చేసుకున్నారు సమీరా. ప్రస్తుతం ఈ జంటకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం ఉన్నారు.

Also Read: Talibans: ఆప్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల దూకుడు..పాకిస్తాన్ సరిహద్దు పోస్ట్ తో పాటు భారీగా నగదు స్వాధీనం!

ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. మొబైల్‌ యాప్‌ పేరుతో మరో చోట భారీ మోసం

Surekha Sikri Dead: మూడుసార్లు జాతీయ అవార్డు విన్నర్.. చిన్నారిపెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu