Pooja Hegde: రాధేశ్యామ్‌ను టైటానిక్‌తో ముడిపెట్టొద్దు.. ఆసక్తికర విషయాలు వెల్లడించింన బుట్టబొమ్మ..

Pooja Hegde: ప్రభాస్‌, పూజా హగ్డేలు (Prabhas, Pooja Hegde) జంటగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్‌ (RadheShyam). ప్రస్తుతం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి రాధేశ్యామ్‌పై పడింది. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కరోనా కారణంగా...

Pooja Hegde: రాధేశ్యామ్‌ను టైటానిక్‌తో ముడిపెట్టొద్దు.. ఆసక్తికర విషయాలు వెల్లడించింన బుట్టబొమ్మ..
Poojahegde Radhe Shyam
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 07, 2022 | 8:20 AM

Pooja Hegde: ప్రభాస్‌, పూజా హగ్డేలు (Prabhas, Pooja Hegde) జంటగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్‌ (RadheShyam). ప్రస్తుతం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి రాధేశ్యామ్‌పై పడింది. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్‌ కూడా సినిమా ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు వరుస ఇంటర్వ్యూలతో పూజాహెగ్డే, ప్రభాస్‌లు బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. రాధేశ్యామ్‌ ట్రైలర్‌ విడుదలైన తర్వాత అందులో ఉండే షిప్‌ మునిగిపోయే సీన్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇదే సమయంలో ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు రాధేశ్యామ్‌ చిత్రాన్ని టైటానిక్‌తో పోల్చడం మొదలు పెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజాకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. ‘అందరూ రాధేశ్యామ్‌ను టైటానిక్‌తో పోల్చుతున్నారు. నిజానికి అలాంటి క్లాసిక్‌ సినిమాతో రాధేశ్యామ్‌ను పోల్చడం సంతోషమే. అయితే ఆ సినిమాతో రాధేశ్యామ్‌ను ముడిపెట్టొద్దు. టైటానిక్‌కు ఈ సినిమాకు ఏమాత్రం పోలిక ఉండదు’ అని క్లారిటీ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ఇక ఈ సందర్భంగా పూజా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, ప్రేమించడానికి సమయం లేదని తేల్చి చెప్పింది. చేతిలో చాలా సినిమాలున్నాయని, వాటిని పూర్తి చేయడంపైనే తన దృష్టి ఉందని చెప్పుకొచ్చింది పూజా. ఇక పూజా హేగ్డే ప్రస్తుతం ఆచార్య, బీస్ట్‌, మహేష్‌ బాబుతో ఓ సినిమా, పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో నటించనుంది.

Also Read: మంత్రి కేటీఆర్ ఔదార్యం.. ట్విట్టర్ అభ్యర్థనపై స్పందన.. మెరిట్ విద్యార్థినులకు ఆపన్న హస్తం

Blood Sugar: సమ్మర్‌లో షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 5 పండ్లను తినాల్సిందే..

Operation Ganga: ఆగని ఆపరేషన్‌ గంగ.. ఉక్రెయిన్‌ నుంచి ఎన్ని విమానాలు వస్తున్నాయో తెలుసా..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..