AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood : జోరు పెంచిన బాలీవుడ్ స్టార్స్.. వరుసగా బడా సినిమాలను లైన్ లో పెట్టిన హీరోలు

2022 టాలీవుడ్‌ నుంచి బిగ్గెస్ట్ ఎవర్ మూవీస్‌ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. కానీ 2023 మాత్రం మాదే అంటూ ఇప్పటి నుంచే సిగ్నల్ ఇస్తోంది నార్త్ ఇండస్ట్రీ.

Bollywood : జోరు పెంచిన బాలీవుడ్ స్టార్స్.. వరుసగా బడా సినిమాలను లైన్ లో పెట్టిన హీరోలు
Bollywood
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2022 | 8:42 AM

Share

Bollywood : 2022 టాలీవుడ్‌ నుంచి బిగ్గెస్ట్ ఎవర్ మూవీస్‌ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. కానీ 2023 మాత్రం మాదే అంటూ ఇప్పటి నుంచే సిగ్నల్ ఇస్తోంది నార్త్ ఇండస్ట్రీ. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ స్టార్ హీరోలంతా.. తమ కెరీర్ బిగ్గెస్ట్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ లైనప్‌తో టాలీవుడ్ ఆదిపత్యానికి నార్త్ మేకర్స్‌ చెక్ పెడతారా..? ఆఫ్టర్ బాహుబలి..ఇండియన్ సినిమాకు పర్యాయపదంగా మారింది టాలీవుడ్. ఈ ట్రెండ్‌ను బ్రేక్‌ చేసేందుకు బాలీవుడ్ కాస్త సీరియస్‌గానే ప్రయత్నిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌లో సౌత్ సినిమాల ఆదిపత్యానికి చెక్‌ పెట్టేందుకు బిగ్గెస్ట్ ఎవర్‌ కాంబినేషన్స్‌తో మోస్ట్ ప్రస్టీజియస్‌ మూవీస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌ కాబోతున్నాయి. 2023 జనవరి నుంచే బాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాల సందడి షురూ కాబోతోంది. లాంగ్ గ్యాప్‌ తరువాత కింగ్ ఖాన్‌ షారూఖ్ చేస్తున్న సినిమా పఠాన్‌. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో షారూఖ్ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోంది పఠాన్‌. మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ టైగర్ 3 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. బ్లాక్ బస్టర్ స్పై సిరీస్‌ లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సల్మాన్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో సౌత్‌ మార్కెట్‌ను కూడా సీరియస్‌గా టార్గెట్‌ చేస్తున్నారు భాయ్‌జాన్‌.

ఇక బాలీవుడ్ బిజీయస్ట్ హీరో అక్షయ్‌ కుమార్ కూడా నెక్ట్స్ ఇయర్ మీద సీరియస్‌ ప్లానింగ్‌లో ఉన్నారు. రామ్ సేతు, OMG 2 , గూర్కా సినిమాలతో పాటు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న యాక్షన్ సిరీస్‌ బడే మియా చోటే మియా ఫస్ట్ పార్ట్‌ నెక్ట్స్ ఇయరే రిలీజ్ కాబోతోంది. అంటే 2023లో రిలీజ్ అవుతున్న అక్షయ్ సినిమాల బడ్జెటే 500 కోట్లకు పైగా ఉండబోతోంది. ఇక ఆమిర్ ఖాన్‌, హృతిక్ రోషన్‌, అజయ్ దేవగన్‌ లాంటి టాప్ స్టార్స్ కూడా నెక్ట్స్ మార్కెట్ మీద చాలా సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. మరి ఈ మిషన్‌లో నార్త్ స్టార్స్ సక్సెస్ అవుతారా..? బాలీవుడ్‌ను మరోసారి ఫేస్‌ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలబెడతారా అన్నది చూడాలి.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..