Nivetha Pethuraj: త్రివిక్రమ్‌ తర్వాత అంత ఎనర్జీ చూసింది విష్వక్‌లోనే.. నివేతా పేతురాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.

తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార నివేతా పేతురాజ్‌. ఇక మెంటల్‌ మదిలో చిత్రం ద్వారా తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిందీ చిన్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం..

Nivetha Pethuraj: త్రివిక్రమ్‌ తర్వాత అంత ఎనర్జీ చూసింది విష్వక్‌లోనే.. నివేతా పేతురాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.
Nivetha Pethuraj
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 21, 2023 | 10:21 AM

తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార నివేతా పేతురాజ్‌. ఇక మెంటల్‌ మదిలో చిత్రం ద్వారా తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిందీ చిన్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నివేతా నటించిన దాస్‌ కా ధమ్కీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విష్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బుధవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సిసిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నివేతా.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నివేతా, విష్వక్‌ కలిసి నటిస్తోన్న రెండో చిత్రమనే విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇది వరకు పాగల్‌ అనే మూవీ వచ్చింది. ఈ నేపథ్యంలో విష్వక్‌తో రెండోసారి కలిసి నటించడానికి కారణం ఏంటన్న దానిపై నివేతా స్పందిస్తూ.. ‘‘దాస్‌ కా ధమ్కీ’ సినిమాకి కూడా మొదట హీరోయిన్‌ని అనుకున్నారట కానీ, ఉన్నట్టుండి ఆ అవకాశం నా దగ్గరికి వచ్చింది. కథ చెప్పాక నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. చివర్లో కథ మారిందని చెప్పారు. చాలా భయమేసింది. అప్పుడు మరోసారి కథ విన్నాక ఇంకా నచ్చింది. అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది’ అని చెప్పుకొచ్చింది.

ఇక విష్వక్‌ దర్శతకత్వం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిచ్చిన నివేతా..హీరోలు నిర్మాతలుగా మారడం చూశా, కానీ విష్వక్‌ దర్శకత్వం కూడా చేశాడు. విష్వక్‌ దర్శకత్వం అంటే ప్రారంభంలో చాలా భయపడ్డా. కానీ నాలుగు రోజుల తర్వాత అంతా సాఫీగా సాగుతోందనే అభిప్రాయం కలిగింది. త్రివిక్రమ్‌ సర్‌ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో అంత ఎనర్జీని నేను చూసింది విష్వక్‌లోనే’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..